
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిగా డా. కె. లలితాదేవిని ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు రంగారెడ్డి డీఎంహెచ్వో గా ఉన్న డాక్టర్ బలుసు వెంకటేశ్వరరావు మంగళవారం (సెప్టెంబర్ 30) పదవీ విరమణ చేయగా, ఆయన స్థానంలో లలితాదేవిని నియమించింది.
డాక్టర్ లలితాదేవి ఇదివరకు హన్మకొండ వైద్యాధికారిగా, వికారాబాద్ జిల్లా ఇన్చార్జీ వైద్యాధికారిగా పనిచేశారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాకు నియమించడంతో... వికారాబాద్ జిల్లాకు ఇన్ చార్జీ వైద్యాధికారిగా డాక్టర్ వై. పవిత్రను నియమించారు. ఈ మేరకు మంగళశారం డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఉత్తర్వులు జారీ చేశారు.