
న్యూఢిల్లీ: దేశ సిరంజీ అవసరాల్లో మెజార్టీ వాటాను సప్లయ్ చేస్తున్న హిందుస్తాన్ సిరంజీస్ అండ్ మెడికల్ డివైజ్ (హెచ్‌ఎండీ) ప్లాంట్లను హర్యానా ప్రభుత్వం మూసేయించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కంపెనీకి చెందిన మూడు ప్లాంట్లను మూసివేసింది. ఇందులో మెయిన్ ప్లాంట్ కూడా ఉంది. దీంతో సిరంజీలు, సూదుల షార్టేజ్ నెలకొంటుందని అంచనా. ప్రస్తుతం దేశ అవసరాల్లో మూడో వంతు సప్లయ్‌ను ఈ కంపెనీనే చేస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఈ టైమ్‌లో సిరంజీల సప్లయ్‌లో కొరత వస్తే అది అనేక సమస్యలకు దారితీస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఫరీదాబాద్ దగ్గర్లోని 11 ఎకరాల్లో నాలుగు మాన్యుఫాక్చరింగ్ ప్లాంట్లను హిందుస్తాన్ సిరంజీస్ ఆపరేట్ చేస్తోంది. ఇందులో మూడు ప్లాంట్లను షట్‌డౌన్ చేయగా, మిగిలిన ప్లాంట్‌ను సోమవారం షట్‌డౌన్ చేస్తామని కంపెనీ తెలిపింది. రెండు రోజులకు మించిన అవసరాలకు సిరంజీలను, సూదులను అందించలేమని పేర్కొంది.
ప్రధానికి లెటర్..
అంతటా సిరంజీల కొరత ఉందని హెచ్‌ఎండీ ఎండీ రాజీవ్ నాథ్ అన్నారు. ఈ కొరత మరింత ముదురుతుందని, అందుకే వాలంటరీగా ప్లాంట్లను మూయడానికి అవకాశం ఇవ్వాలని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌కు, హెల్త్‌కేర్ సెక్టార్‌కు సిరంజీల అవసరం ఎక్కువగా ఉంటుందని, అందుకే వీటిని క్రిటికల్ మెడికల్ డివైజ్‌లుగా డిక్లేర్ చేయాలని ప్రధాని మోడీకి హెచ్‌ఎండీ లెటర్ రాసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ప్రొడక్షన్ చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది.