మేకపాలతో లస్సీ, పెరుగు! టేస్ట్ చేయాలనుందా?

మేకపాలతో లస్సీ, పెరుగు! టేస్ట్ చేయాలనుందా?

మేకపాలతో తయారైన పెరుగును ఎప్పుడైనా తిన్నారా? వాటి నుంచి వచ్చే వెన్న టేస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారా? మేకపాల నుంచి తయారు చేసిన లస్సీ తాగారా? మేకపాలతో ఇన్ని ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఉన్నాయా అనుకుంటున్నారా? త్వరలోనే ఇవన్నీ పెద్ద మొత్తంలో అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన డైరీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు ఇప్పటికే మేకపాల నుంచి బోలెడు ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ తయారు చేస్తున్నాయి.

పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, లస్సీ వంటి వాటిని ఆవుపాలు, గేదెపాల నుంచే తయారు చేస్తారు. టీ, కాఫీలు తయారు చేయాలన్నా వీటినే వాడుతున్నారు. స్వీట్స్ తయారీలోనూ ఇవే ఉంటాయి. ఆవుపాలు, గేదెపాలు తప్ప వేరే డైరీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ పెద్దగా కనిపించవు మనదగ్గర. ఒంటెపాలు, మేకపాలు, గొర్రెపాలు వంటివి ఉన్నా వాటిని రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వాడరు. కానీ, గుజరాత్‌‌‌‌‌‌‌‌లో ఇప్పుడు మేకపాలకు మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. వీటితో అనేక డైరీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ తయారుచేస్తున్నారు. పలు కంపెనీలు, రైతులు ఈ పనిలో ముందున్నారు కూడా.

కొత్త ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ తయారీ
ఇంతకుముందు మేకపాలతో ఎక్కువగా టీ, కాఫీలు మాత్రమే తయారుచేసేవాళ్లు. అరుదుగా పెరుగు చేస్తారు. కానీ, ఇప్పుడు అనేక డైరీ ఉత్పత్తుల్ని మేకపాలతో తయారు చేస్తున్నారు. ‘అమూల్‌‌‌‌‌‌‌‌’ వంటి సంస్థలతోపాటు, గుజరాత్‌‌‌‌‌‌‌‌కు చెందిన కొన్ని కంపెనీలు ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. కొన్ని ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌ను ఇప్పటికే మార్కెట్లోకి రిలీజ్‌‌‌‌‌‌‌‌ చేశాయి. రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఒక కంపెనీ మేకపాల లస్సీతోపాటు, శ్రీఖండ్‌‌‌‌‌‌‌‌ (స్వీట్‌‌‌‌‌‌‌‌)ను కూడా లాంఛ్‌‌‌‌‌‌‌‌ చేసింది. ‘న్యూట్రాగోట్‌‌‌‌‌‌‌‌, ఫామ్‌‌‌‌‌‌‌‌ఫ్రెష్‌‌‌‌‌‌‌‌’ వంటి కంపెనీలు ఫ్రోజెన్‌‌‌‌‌‌‌‌ గోట్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ను అమ్ముతున్నాయి. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేకపాల ధర తక్కువగా ఉంటే, ఫ్రోజెన్‌‌‌‌‌‌‌‌ మిల్క్‌‌‌‌‌‌‌‌ ధర మాత్రం చాలా ఎక్కువ. లీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల ధర రూ.450గా ఉంది. కేజీ మేకపాల పొడి ధర రూ.1,200 కాగా, మేకపాలతో తయారయ్యే సబ్బు ధర రూ.150 వరకు ఉంది. ఈ పాలతో గ్రీక్‌‌‌‌‌‌‌‌ యోగర్ట్‌‌‌‌‌‌‌‌ కూడా తయారు చేస్తున్నారు. మేకపాల నుంచి తయారైన ప్రత్యేకమైన చీజ్​(ఫెటా)కు ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌గా మంచి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉంది. తెల్లగా, మృదువుగా ఉంటుంది ఫెటా. అయితే, సాధారణ మేకపాల ధర ఇరవై నుంచి ముప్పై రూపాయలే.

పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌గా
ఇప్పటివరకు మేకపాలు, గొర్రెపాలకు పెద్దగా మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌ లేదు. కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ లేకపోవడం వల్ల ఈ పాలకు డిమాండ్‌‌‌‌‌‌‌‌ కూడా లేదు. కానీ, ఇప్పుడు గుజరాత్‌‌‌‌‌‌‌‌లోని మూడు తాలూకాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌‌‌‌‌ సంస్థల ఆధ్వర్యంలో పైలట్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ చేపట్టారు. దీనిద్వారా మేకలు, గొర్రెలు పెంచుకుంటున్న ఎనిమిది వేల కుటుంబాలకు మేలు జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ పరిధిలో ప్రస్తుతానికి కనీసం నాలుగు వేల లీటర్ల పాలను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌
ఒకపక్క ఆవుపాలు, గేదెపాలు, డైరీ ప్రొడక్ట్స్‌‌‌‌‌‌‌‌కు డిమాండ్‌‌‌‌‌‌‌‌ పెరుగుతుంటే.. మరోపక్క డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగ్గట్లు ఉత్పత్తి జరగడం లేదు. దీంతో మేకపాలు, గొర్రెపాలు ఆల్టర్నేటివ్‌‌‌‌‌‌‌‌గా మారుతున్నాయి. విదేశాల్లో వీటికి ఎప్పట్నుంచో కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌‌‌‌‌ ఉంది. మనదేశంలో మాత్రం ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్‌‌‌‌‌‌‌‌ స్టార్ట్‌‌‌‌‌‌‌‌ అవుతోంది. దీనివల్ల రైతులకూ మేలు జరుగుతుంది.

మంచివేనా?
ఆవుపాలు, గేదెపాలతో పోలిస్తే మేకపాలు, గొర్రెపాలకు మనదగ్గర డిమాండ్‌‌‌‌‌‌‌‌ తక్కువే. కానీ, పోషకాల విషయంలో వాటికేమాత్రం తీసిపోవు. ఇవి చాలా క్రీమీగా, చిక్కగా ఉంటాయి. ప్రొటీన్‌‌‌‌‌‌‌‌, క్యాల్షియం, ఐరన్‌‌‌‌‌‌‌‌, జింక్‌‌‌‌‌‌‌‌, విటమిన్‌‌‌‌‌‌‌‌–డి, థయమిన్‌‌‌‌‌‌‌‌, రైబోఫ్లేవిన్‌‌‌‌‌‌‌‌, విటమిన్‌‌‌‌‌‌‌‌–బి6, అమైనో యాసిడ్స్‌‌‌‌‌‌‌‌ వంటివి ఈ పాలలో ఎక్కువగా ఉంటాయి. మేకపాలలో కొవ్వు శాతం చాలా తక్కువ. అందువల్ల ఈ పాలు రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీసుకుంటే కొలెస్ట్రాల్‌‌‌‌‌‌‌‌ శాతం తగ్గుతుంది. ఇవి త్వరగా అరుగుతాయి కూడా. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తాగితే గాయాల నుంచి త్వరగా కోలుకుంటారు. చర్మానికి చాలా మంచిది. అనేక రకాల ​అలర్జీలను తగ్గిస్తాయి. గుండె జబ్బుల్ని తగ్గిస్తాయి. గేదెపాలంటే అలర్జీ ఉన్నవాళ్లలో కూడా మేకపాలు కొందరిలో అలర్జీ కలిగించకపోవడాన్ని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌లు గుర్తించారు. అయితే, లాక్టోజ్‌‌‌‌‌‌‌‌ పడని వాళ్లు ఈ పాలకు దూరంగా ఉండటమే మంచిది.