శామ్ సంగ్ ఏ సిరీస్ లో మరో 5 మోడల్స్

శామ్ సంగ్ ఏ సిరీస్ లో మరో 5 మోడల్స్

హైదరాబాద్, వెలుగు: ఫోన్ల తయారీ కంపెనీ శామ్ సంగ్ తమ ఏ సిరీస్ పోర్ట్ ఫోలియోలో ఐదు కొత్త మోడల్స్ ను  అందుబాటులోకి తెచ్చింది. గెలాక్సీ ఏ13, ఏ 23, ఏ33, ఏ53, ఏ 73 మోడల్స్ ను 5 జీ వెర్షన్ లో కంపెనీ తీసుకొచ్చింది. దీంతో కంపెనీ ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్ మోడల్స్  11 కు చేరుకున్నాయి. గెలాక్సీ ఏ73 5జీ లో 778జీ 5జీ ప్రాససర్ ను వాడారు. ఆమోలెడ్ డిస్ ప్లే, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్, 108 ఎమ్ పీ కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి. త్వరలో ఈ స్మార్ట్ ఫోన్ రేటు ప్రకటిస్తామని కంపెనీ కేటగిరీ హెడ్ ( హై ఎండ్ స్మార్ట్ ఫోన్స్) అక్షయ్ ఎస్ రావ్ అన్నారు.

ఏ 33 మోడల్ రేటును కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. మిగిలిన మోడల్స్ లో గెలాక్సీ ఏ 53 5జీ ధర రూ. 34,499 (6జీబీ+128జీబీ) నుంచి స్టార్ట్ అవుతోంది. ఏ 23 ధర రూ. 19,499 ( 6జీబీ+128 జీబీ), ఏ 13 ధర రూ. 14,999 నుంచి స్టార్ట్ అవుతోంది. వాటర్ రెసిస్టన్స్, డస్ట్ రెసిస్టన్స్ వంటి కొత్త ఫీచర్లు ఈ ఫోన్లలో ఉన్నాయని అక్షయ్ పేర్కొన్నారు. దేశంలోని రూ. 20 వేల నుంచి రూ. 45 వేల స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ లో  లీడర్లు గా ఉన్నామని, ప్రస్తుతం ఉన్న 25% మార్కెట్ వాటాను 40 శాతానికి పెంచుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నామని అన్నారు. ప్రస్తుతం 16 5 జీ   మోడల్స్ ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.