
ఇన్నాళ్లూ తన సినిమాలను తెలుగులోనే డబ్ చేసిన విశాల్.. ఇప్పుడొక ప్యాన్ ఇండియా మూవీతో రెడీ అవుతున్నాడు. ‘లాఠీ’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ఎ.వినోద్ కుమార్ దర్శకుడు. నిన్నటితో ఈ మూవీ సెకెండ్ షెడ్యూల్ పూర్తయినట్టు సోషల్ మీడియా ద్వారా కన్‌ఫర్మ్ చేశాడు విశాల్. ఆఖరి రోజున టీమ్ అంతా ఇరవై నాలుగు గంటల పాటు షూట్ చేశామని విశాల్ ట్వీట్ చేశాడు. అలాగే మూడో షెడ్యూల్ డిటెయిల్స్ కూడా అనౌన్స్ చేసేశాడు. నలభై రోజుల పాటు హైదరాబాద్‌లో జరగనున్న ఈ షెడ్యూల్‌లో పీటర్ హెయిన్స్ యాక్షన్ సీన్స్ కంపోజ్ చేయనున్నాడు. ఇందులో విశాల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.