స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా, షార్క్ 2 4జీ ఫోన్‌ను రూ.7 వేల ధరకు లాంచ్ చేసింది. ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే, 50ఎంపీ ఏఐ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. యూనిసాక్ టీ7250 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ కలిగి ఉంది.
ఆండ్రాయిడ్ 15పై రన్ అవుతున్న ఈ ఫోన్‌కు, ఒక అండ్రాయిడ్ అప్‌గ్రేడ్, రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ను కంపెనీ ఆఫర్ చేస్తామని లావా పేర్కొంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌కు ఐపీ54 రేటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
