కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై సీజేఐ అసంతృప్తి

కోర్టుల్లో మౌలిక సదుపాయాలపై సీజేఐ అసంతృప్తి

ఔరంగాబాద్: దేశంలో న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాలపై చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. బాంబే హైకోర్టు.. ఔరంగాబాద్ బెంచ్ భవనం ఓపెనింగ్ లో ఆయన మాట్లాడారు. జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుదలకు తగు చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును కోరారు. నేషనల్ జ్యుడీషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదనను పెట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కిరణ్ రిజిజుతోపాటు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ.. కోర్టులు సమాజానికి చాలా ముఖ్యమన్నారు. న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకం.. ప్రజాస్వామ్యానికి చాలా బలాన్నిస్తోందన్నారు. కానీ మౌలిక వసతుల విషయంలో న్యాయ వ్యవస్థను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 

దేశంలో 5 శాతం కోర్టు కాంప్లెక్సుల్లో మాత్రమే ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయని ఎన్‌వీ రమణ చెప్పారు. 26 శాతం కోర్టుల్లో మహిళలకు ప్రత్యేక టాయ్‌లెట్లు లేవని.. 16 శాతం న్యాయ స్థానాల్లో పురుషులకు మూత్రశాలలు లేవన్నారు. దాదాపు 50 శాతం కోర్టు కాంప్లెక్సుల్లో లైబ్రరీలు లేవని.. 46 శాతం న్యాయస్థానాల్లో శుద్ధి చేసిన తాగు నీరు దొరికని పరిస్థితి ఉందన్నారు. సీజేఐ రమణ కామెంట్లపై సభలో పాల్గొన్న న్యాయ శాఖ మంత్రి రిజిజు సానుకూలంగా స్పందించారు. జ్యుడీషియరీ విషయంలో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని రిజిజు స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో రాజకీయాలు కీలకమన్న ఆయన.. జ్యుడీషియరీ విషయంలో మాత్రం పాలిటిక్స్‌కు చోటు లేదన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

గాంధీ భవన్‌లో గాడ్సేలు దూరారు: కేటీఆర్

టీజర్‌ అదుర్స్: నేను దేవుడిని కాదు.. కానీ నాకు అన్నీ తెలుసు

లెహెంగాల్లో డ్రగ్స్ పార్శిల్.. పట్టుకున్న NCB అధికారులు