ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ను ఏ–1గా చేర్చాలి

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో కేసీఆర్​ను ఏ–1గా చేర్చాలి

పంజాగుట్ట, వెలుగు: బీఆర్ఎస్​హయాంలో జరిగిన ఫోన్​ట్యాపింగ్​పై సమగ్ర విచారణ జరిపించాలని అరుణ్​కుమార్​అనే లాయర్ ​శుక్రవారం రాత్రి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శోభన్​ను కలిసి ఫోన్​ ట్యాపింగ్​కేసులో మాజీ సీఎం కేసీఆర్​ను ఏ–1గా చేర్చాలని కోరారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్​రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక ఆదేశాలతో మాత్రమే ఫోన్ ​సంభాషణలు వినే అవకాశం ఉంటుందని, అందుకు విరుద్ధంగా అధికారులపై ఒత్తిడి తెచ్చి, ఫోన్​ ట్యాపింగ్ ​చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీఆర్ఎస్​హయాంలో జరిగిన అవినీతిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు.