బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరికలు : బడే నాగజ్యోతి

బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరికలు : బడే నాగజ్యోతి

తాడ్వాయి/వర్ధన్నపేట/కమలాపూర్‌‌‌‌, వెలుగు : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన లీడర్లు బుధవారం బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం బయ్యక్కపేట, నార్లాపూర్, పడిగాపూర్‌‌‌‌ గ్రామాలకు చెందిన పలువురు బీఆర్ఎస్‌‌‌‌లో చేరగా వారికి ములుగు జడ్పీచైర్మన్‌‌‌‌, బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ బడే నాగజ్యోతి కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

కార్యక్రమంలో ఊరటం సర్పంచ్‌‌‌‌ గొంది శ్రీధర్, నాయకులు, సిద్దబోయిన శివరాజ్, సీడెం బాబురావు, గుర్రం సమ్మిరెడ్డి పాల్గొన్నారు. అలాగే వరంగల్‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి, బొక్కలగూడెం గ్రామాలకు చెందిన పలువురికి ఎమ్మెల్యే రమేశ్‌‌‌‌ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అప్పారావు, ఎంపీటీసీ ఉమాదేవి పాల్గొన్నారు. హనుమకొండ జిల్లాలోని వంగపల్లికి చెందిన పలువురు ప్రభుత్వ విప్‌‌‌‌, ఎమ్మెల్సీ కౌశిక్‌‌‌‌రెడ్డి సమక్షంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లో చేరారు. జడ్పీ చైర్‌‌‌‌పర్సన్‌‌‌‌ కనుమళ్ల విజయ, నాయకులు తక్కెళ్లపల్లి సత్యనారాయణరావు ఉన్నారు.