టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

పనాజీ: వెటరన్ టెన్నిస్ ప్లేయర్ లియాండర్ పేస్ శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వెస్ట్ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. పేస్‌తోపాటు మాజీ మిస్ ఇండియా, నటి నఫీసా అలీ, మృణాళినీ దేశ్‌ప్రభు కూడా టీఎంసీలో చేరారు. 2022లో గోవా అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తృణమూల్‌లో పేస్, నఫీలా అలీ చేరడం ఆ పార్టీలో కొత్త జోష్ నింపింది. వీరి చేరికను దీదీ స్వాగతించారు. లియాండర్ పేస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె ట్వీట్‌ చేశారు. లియాండర్ తనకు  తమ్ముడు లాంటి వాడని మమత అన్నారు. తాను యువజన శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన తనకు తెలుసునని.. పేస్ చాలా యంగ్ అని ఆ ట్వీట్‌లో దీదీ పేర్కొన్నారు.

లియాండర్ పేస్  కూడా మమతా బెనర్జీని పొగుడుతూ ట్వీట్ చేశారు. ‘క్రీడలు మనకు చాలా విషయాలు నేర్పిస్తాయి. టెన్నిస్ కోర్టులో నేర్చుకునే పాఠాలు చాలా విలువైనవి. వాటిని మనం జీవితంలోనూ అమలు చేయొచ్చు. నేను టెన్నిస్ నుంచి రిటైరయ్యాను. రాజకీయాలనే వాహనం ఎక్కి ప్రజలకు సేవ చేయాలని భావిస్తున్నాను. దేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీదీ నిజమైన ఛాంపియన్’ అని పేస్ అన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత

ఇదెక్కడి న్యాయం.. కేటీఆర్‌కు అనసూయ ట్వీట్ 

కళ్లు దానం చేసిన పునీత్ రాజ్‌కుమార్