గుండెను కాపాడే లీ హెల్త్‌‌‌‌‌‌‌‌ లైఫోస్టెరాల్‌‌‌‌‌‌‌‌

గుండెను కాపాడే లీ హెల్త్‌‌‌‌‌‌‌‌ లైఫోస్టెరాల్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: న్యూట్రాసూటికల్స్ తయారు చేసే హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ కంపెనీ లీ హెల్త్ డొమెయిన్.. గుండె సంరక్షణ కోసం సహజ సిద్ధ ఔషధ మూలికలతో లైఫోస్టెరాల్ సాఫ్ట్‌‌‌‌‌‌‌‌ జెల్ క్యాప్సూల్స్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది. ఇందులో వెల్లుల్లి సారం, గామా ఒరిజనోల్, ఫైటోస్టెరాల్, లైకోపీన్,  కుర్కుమిన్, మెంతికూర, నల్ల మిరియాల నుంచి తీసిన పైపెరిన్‌‌‌‌‌‌‌‌ సమ్మేళనాలను చేర్చారు.  

విస్తృత పరిశోధన తర్వాత లైఫోస్టెరాల్‌‌‌‌‌‌‌‌కు రూపకల్పన చేశామని లీ హెల్త్‌‌‌‌‌‌‌‌ డొమెయిన్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ ఆళ్ల లీలా రాణి చెప్పారు.  అమెజాన్‌‌‌‌‌‌‌‌, కంపెనీ వెబ్​సైట్​​తోపాటు ప్రముఖ ఫార్మసీలలో లైఫోస్టెరాల్ ఈ కాప్సూల్స్​ లభిస్తాయి. జీవనశైలి సంబంధ సమస్యలు, కీళ్ల నొప్పులు, కంటి జలుబు, జలుబు, దగ్గు వంటి సమస్యల కోసం లీ హెల్త్ డొమెయిన్  పరిశోధనల అనంతరం సహజసిద్ధ మూలికలతో మందులను తయారు చేస్తోంది.