బిట్ బ్యాంక్ : తెలంగాణ అడవులు

బిట్ బ్యాంక్ :  తెలంగాణ అడవులు
  •    తెలంగాణలో అనార్ద్ర ఆకురాల్చు అరణ్యాలు అధికంగా విస్తరించి ఉన్నాయి. 
  •     75 –100 సెం.మీ.ల కంటే తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతంలో పెరిగే అరణ్యాలను అనార్ద్ర ఆకురాల్చు అరణ్యాలు అంటారు. 
  •     50 సెం.మీ.ల కంటే తక్కువ వర్షపాతంలో పెరిగే అరణ్యాలను చిట్టడవులు అంటారు. 
  •     తెలంగాణ ప్రాంతంలో స్థానికంగా విస్తరించి ఉన్న గడ్డి భూములను కంచాస్​ అని పిలుస్తారు. 
  •     జాతీయ అటవీ విధానం–1952 ప్రకారం దేశంలో 33శాతం కంటే ఎక్కువ అడవులు కచ్చితంగా ఉండాలి. 
  •     1978లో తొలి సామాజిక అడవుల చట్టం చేశారు. 
  •     2002లో జీవ వైవిధ్య చట్టం చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు ఏర్పడింది. 
  •     ప్రాక్​ దేశపు రాజవృక్షం అని టేకు చెట్టుని పిలుస్తారు. 
  •     నిర్మల్​ కొయ్య బొమ్మల తయారీకి ఉపయోగించే కలప పునికి. 
  •     పోలీసుల లాఠీలు తయారు చేయడానికి ఉపయోగించే కలప మగవెదురు. 
  •     టెంట్​ కర్రల తయారీకి ఉపయోగించే కలప కాజురైన (సరివి).
  •     బీడీల తయారీకి తుని, తెండు ఆకులను ఉపయోగిస్తారు. 
  •     నేషనల్​ బోర్డ్​ ఫర్ వైల్డ్​ లైఫ్​ చైర్మన్​గా ప్రధాన మంత్రి వ్యవహరిస్తారు. 
  •     తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట. 
  •     ప్రతి సంవత్సరం జులైలో వన మహోత్సవం నిర్వహిస్తారు. 
  •     మెగా డైవర్సిటీ దేశాల్లో భారతదేశం ఎనిమిదో స్థానంలో ఉంది. 
  •     ప్రపంచంలో మొదటి జాతీయ పార్క్​ ఎల్లోస్టోన్​ నేషనల్​ పార్క్​. 
  •     ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం తెలంగాణలో అటవీ విస్తీర్ణం 21,214 చ.కి.మీ.
  •      ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణ శాతం 18.93శాతం. 
  •     అత్యల్ప అటవీ విస్తీర్ణం కలిగిన జిల్లా హైదరాబాద్​. 
  •     అటవీ శాతం అత్యల్పంగా కలిగిన జిల్లా కరీంనగర్​. 
  •     అటవీ శాతం అత్యధికంగా కలిగిన జిల్లా ములుగు. 
  •     దేశంలో అత్యధిక విస్తీర్ణంలో అడవులను కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్.
  •     తెలంగాణ ఫారెస్ట్​ అకాడమీ దూలపల్లిలో ఉంది. 
  •     ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం రాష్ట్రంలో దట్టమైన అడవుల విస్తీర్ణం 1624 చ.కి.మీ.
  •     ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో మోస్తరు దట్టమైన అడవుల విస్తీర్ణం 9,119 చ.కి.మీ.
  •     ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం రాష్ట్రంలో  అటవీ విస్తీర్ణంలో పొదల విస్తీర్ణం 2,911 చ.కి.మీ.
  •     ఐఎస్ఎఫ్ఆర్​ 2021 ప్రకారం తెలంగాణ ఓపెన్​ ఫారెస్ట్​ విస్తీర్ణం 10,471 చ.కి.మీ.
  •     2019తో పోలిస్తే 2021 నాటికి తెలంగాణలో పెరిగిన అటవీ విస్తీర్ణం 632 చ.కి.మీ.
  •     ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం తెలంగాణలో చెట్ల విస్తీర్ణం 2,848 చ.కి.మీ.
  •     ఐఎస్ఎఫ్ఆర్​ 2021 ప్రకారం తెలంగాణ భౌగోళిక విస్తీర్ణంలో అడవులు, చెట్ల విస్తీర్ణ శాతం 22.30 శాతం. 
  •     ఐఎస్​ఎఫ్​ఆర్​ 2021 ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో చెట్ల విస్తీర్ణ శాతం 2.54 శాతం. 
  •     రాష్ట్రంలో ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ములుగులో ఉంది. 
  •     రాష్ట్రంలో గుర్తించిన మొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశం అమీన్​పూర్​ చెరువు. 
  •     తెలంగాణ రాష్ట్ర పక్షుల స్వర్గంగా పిలిచే జలాశయం అమీన్​పూర్​ చెరువు. 
  •     కొత్తగూడెం ప్రాంతంలో అత్యంత దట్టమైన అడవులు ఉన్నాయి. 
  •     తెలంగాణలో 80 శాతం వృక్షాలు హార్ట్​ వికియా బినాట్​, అల్ఫిజియామరా వృక్ష జాతికి చెందినవి. 
  •     సామాజిక అడవులు అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం ఆరో పంచవర్ష ప్రణాళిక కాలంలో ప్రారంభించారు. 
  •     సామాజిక అడవుల పరిశోధన కేంద్రం అలహాబాద్​లో ఉంది. 
  •     రాష్ట్రంలో 1980–82లో సామాజిక అడవుల కార్యక్రమాన్ని అమలు చేశారు. 
  •     భారతదేశ తలసరి అటవీ విస్తీర్ణం 0.240 హెక్టార్లు.
  •     ప్రపంచంలో అత్యంత వేగంగా పెరిగే మొక్క వెదురు.