
క్లైమెట్ రోజురోజుకూ భయపెడుతోంది. చాప కింద నీరులా విజృంభిస్తోంది. జాగ్రత్తగా ఉండాలని, ఎకో ఫ్రెండ్లీ వస్తువులే వాడాలని ఇప్పటికే ఎంతో మంది సైంటిస్టులు చెప్పారు. చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంగ్లండ్కు చెందిన స్విమ్మర్ లూయిస్ పుగ్ కూడా ఇదే చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇందుకోసం అంటార్కిటిక్ ఐస్ కిందున్న నదిలో ఈదాడు. గడ్డకట్టే చలిలో కేవలం ఓ క్యాప్, కళ్లద్దాలతో ఈత కొట్టారు. 8 నిమిషాల్లోనే స్విమ్మింగ్ కంప్లీట్ చేశాడు. ఇలా ఐస్ షీట్ కింద ఈత కొట్టిన తొలి వ్యక్తిగా రికార్డు సాధించాడు. ‘తూర్పు అంటార్కిటికాలో ఇలా స్విమ్ చేయడానికి ఓ కారణముంది. ప్రపంచవ్యాప్తంగా వేడి ఎక్కువై ఈ ప్రాంతమంతా వేగంగా కరిగిపోతోంది. ప్రస్తుతం మనం క్లైమెట్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటున్నాం. ప్రపంచ నేతలు దీనిపై దృష్టి పెట్టాలి. టైమైపోతోంది’ అని లూయిస్ అంటున్నాడు.