ఎల్ఐసీ ఐపీఓ షేర్ల ధర ఖరారు..ఎంతంటే..

ఎల్ఐసీ ఐపీఓ షేర్ల ధర ఖరారు..ఎంతంటే..

న్యూఢిల్లీ : దేశంలోని అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ ఐపీఓ (LIC IPO) షేర్ల ధరను ఖరారు చేశారు. దేశ క్యాపిటల్ మార్కెట్ చరిత్రలో అతి పెద్దదైన ఎల్ఐసీ ఇటీవలే ఐపీఓకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. షేర్ల ధరను రూ. 949గా ఖరారు చేశారు. గరిష్ట ధర వద్దే ముదుపర్లకు షేర్లు కేటాయించడం జరిగిందని ఎక్స్చేంజ్ లకు సమాచారం ఇచ్చింది. ఈ షేర్లు మే 17వ తేదీన స్టాక్ ఎక్స్చేంజ్‌‌లలో నమోదు కానున్నాయి. ఐపీఓ ద్వారా.. ప్రభుత్వం మొత్తం రూ. 20 వేల 560 కోట్లు సమీకరించినట్లు అంచనా వేస్తున్నారు. 

గ్రే మార్కెట్ గా పిలిచే అనధికార మార్కెట్ లో ఎల్ఐసీ షేరు రూ. 30 రాయితీతో ట్రేడవుతుండడం, ఐపీఓ ప్రారంభమైన తొలి రోజు గ్రే మార్కెట్ లో ఈ షేరు ధర రూ. 100 ప్రీమియం వద్ద ట్రేడయ్యింది. అయితే.. లిస్టింగ్ దగ్గర కొస్తూ.. డిమాండ్ తగ్గిపోతుండడం జరుగుతోందని ట్రేడింగ్ వర్గాలు భావిస్తున్నాయి. అన్ని విభాగాల్లో కలిపి 2.95 రేట్లు సబ్ స్క్రైబ్ అయ్యింది. 
ఐపీఓలో 'పాలసీ హోల్డర్స్' కోటా కూడా ఉన్నందున, దీని ద్వారా వాళ్లు ఇష్యూలో పెట్టుబడి పెట్టవచ్చు. ఒక్కో షేరుకు ధరను ఇటీవలే రూ.902 నుండి రూ.949గా నిర్ణయించారు. ఎల్‌‌‌‌‌‌‌‌ఐసి ఉద్యోగులకు 15 లక్షల షేర్లు,   పాలసీదారులకు  2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేశారు.

Read More : చల్లటి కబురు.. ముందుగానే నైరుతి..

Read More : న్యాయం కోసం కశ్మీరీ పండిట్ల ఆందోళన