నాకు అనుమతివ్వండి.. అన్వేష్‌ను భరత మాత కాళ్ల దగ్గర పడేస్తా: ఉక్రెయిన్ మహిళ

నాకు అనుమతివ్వండి.. అన్వేష్‌ను భరత మాత కాళ్ల దగ్గర పడేస్తా: ఉక్రెయిన్ మహిళ

హైదరాబాద్: ‘నాకు అనుమతివ్వండి.. నా అన్వేషణ అన్వేష్‌ను భరత మాత కాళ్ల దగ్గర తీసుకొచ్చి పడేస్తా’ అని ఉక్రెయిన్కు చెందిన ఈ మహిళ అన్నారు. ఆంధ్రా అబ్బాయి తుమ్మపాల వెంకట్‌ను లిడియా లక్ష్మి వివాహం చేసుకున్నారు. భారతదేశంలోని సనాతన ధర్మానికి ఆమె ఫిదా అయ్యారు. ఇక్కడి సంస్కృతి సనాతన ధర్మాన్ని స్టడీ చేసిన ఆమె ధర్మం పట్ల తన నిబద్ధతను చాటుకుంటోంది. 

ఈ క్రమంలోనే.. భారతీయ సంప్రదాయాలపై అన్వేష్‌  చేస్తున్న వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. థాయిలాండ్‌ ఎంబసీలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె తనకు అవకాశం ఇస్తే అన్వేష్‌ను పట్టుకొస్తానని చెబుతోంది. లేకపోతే మరో దేశానికి అతడు పారిపోయే అవకాశాలున్నాయని ఆమె స్పష్టం చేసింది.

నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్న ఇన్‌ ఫ్లుయెన్సర్‌ అన్వేష్​పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ (ఎన్ సీడీబ్ల్యూ)ను రాష్ట్ర మహిళా కమిషన్ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే. మహిళలను కించపరుస్తూ సదరు యూట్యూబర్  అసభ్యకరమైన వీడియోలను ప్రసారం చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు అందాయని ఎన్ సీడబ్ల్యూకు రాష్ట్ర మహిళా కమిషన్  తెలిపింది. 

పిల్లల హక్కులకు భంగం కలిగించేలా చట్టవిరుద్ధమైన కంటెంట్  అప్ లోడ్  చేస్తున్నాడని కంప్లైంట్స్ వచ్చాయని తెలిపింది. హిందూ దేవతలపైనా అత్యంత అభ్యంతరకరంగా, భావోద్వేగాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశాడని కమిషన్  పేర్కొంది. ఇలాంటి కంటెంట్  నైతికతను, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తుందని కమిషన్  అభిప్రాయపడింది.