ఫేస్ బుక్ లో పరిచయం : 81 ఏళ్ల వృద్ధురాలితో 36 ఏళ్ల యువకుడు..!

ఫేస్ బుక్ లో పరిచయం : 81 ఏళ్ల వృద్ధురాలితో 36 ఏళ్ల యువకుడు..!

2 నెలల క్రితం ఫేస్ బుక్ లో పరిచయమైన 36 ఏళ్ల ఈజిప్ట్ యువకుడి అహ్మద్ ఇబ్రహీంని బ్రిటన్ కు చెందిన ఐరిస్ జోన్స్ అనే 81 ఏళ్ల వృద్ధురాలు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరు ఎలా కలిసుంటారని అప్పట్నుంచీ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా వీరిద్దరు బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు బయటికి రావడంతో.. డబ్బు ఆశ చూపించే యువకుడిని బుట్టలో వేసుకుందని చెప్పుకొచ్చారు.

అయితే దీనిపై లేటెస్ట్ గా స్పందించిన బామ్మ.. యువకుడు డబ్బుకోసమే తనను ప్రేమించాడని వస్తున్న విమర్శలను కొట్టిపారేసింది. తన భర్త ప్రేమలో నిజాయితీ ఉందని ట్రోలర్స్ కి గట్టిగా సమాధానమిచ్చింది. మా ప్రేమను ఎవరూ నాశనం చేయలేరని చెప్పింది. అంతేకాకుండా తమ శృంగార జీవితమూ సాఫీగా సాగిపోతోందని బామ్మ చెప్పడంతో నెటిజన్లు ఛలోక్తులు వేసుకుంటున్నారు ఎంజాయ్ మ్యారీడ్ లైఫ్ బామ్మా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.