ఎర్రబెల్లి జాతరకు పోటెత్తిన భక్తులు 

ఎర్రబెల్లి జాతరకు పోటెత్తిన భక్తులు 
  • వైభవంగా లింగమంతుల కల్యాణం 

హాలియా, వెలుగు : నల్గొండ జిల్లా నిడనూరు మండలం ఎర్రబెల్లి గ్రామంలో లింగమంతుల స్వామి జాతర సోమవారం భక్తులతో పోటెత్తింది. ఎర్రబెల్లి గుట్టపై వెలసిన మాణిక్యాల దేవీ లింగమంతుల స్వామి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు జాతరకు భారీగా తరలివచ్చారు.

యాదవుల ఆరాధ్యదైవమైన లింగమంతుల స్వామికి కులస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి బోనాలు సమర్పించి ఏటపోతులను బలిచ్చారు. అనంతరం ముప్పారం గ్రామంలోని వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే జయవీర్​రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. నాగార్జునసాగర్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఉత్సవాల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.