రొటీన్​ పాటలు ఇష్టం లేదు

రొటీన్​ పాటలు ఇష్టం లేదు

వివేక్​ సాగర్​ మ్యూజిక్​లో వచ్చిన ఏ పాట విన్నా.. అది సినిమాటిక్​గా అనిపించదు. ప్రతీది సహజంగా.. నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే పెళ్లిచూపులు రిలీజై ఇన్నేళ్లు అయినా ఇంకా ఆ పాటలు ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాల్లోనూ తన మార్క్​ మ్యూజిక్​ని కంటిన్యూ చేశాడు ఈ మ్యుజీషియన్​. ఆ జర్నీ గురించి అడిగితే... ‘అసలు ఇండస్ట్రీలోకి రావాలన్న  ఆలోచనే లేదు నాకు. సినిమాలకి ట్యూన్స్​ కట్టాలన్న కోరిక అంతకన్నా లేదు. కానీ, బతికినంత కాలం మ్యూజిక్​లోనే ఉండాలనుకున్నా. డిఫరెంట్​ మ్యూజిక్​ స్టయిల్స్​ని ఎక్స్​ప్లోర్​ చేయాలనుకున్నా. ​ ఆ ప్రాసెస్​లోనే ఫ్రెండ్స్​తో​ కలిసి  బ్యాండ్​ ఫామ్​ చేశా. అక్కడ్నించి షార్ట్ ఫిల్మ్స్​, సినిమాల వైపు వచ్చా’ అంటూ చిన్నప్పట్నించీ జరిగిన కథంతా చెప్పుకొచ్చాడు వివేక్​. 
అప్పుడే పాట పరిచయం

మా అమ్మ క్లాసికల్​ డాన్సర్​. బాగా పాడుతుంది కూడా. అలా మ్యూజిక్​ మీద ఇంట్రెస్ట్ వచ్చింది.​పెద్దయ్యేకొద్ది ఆ  ఇంట్రెస్ట్​ పెరుగుతూ వచ్చింది. దానికి కారణం మా అన్నయ్య. తను కూడా సింగర్​. ఇనుస్ట్రుమెంటల్​, వెస్ట్రన్, ​రాక్​, ఫ్రెంచ్​ ఇలా డిఫరెంట్​ మ్యూజిక్​ వినేవాడు అన్నయ్య. ఇండియన్​ మ్యూజిక్​లోనూ సినిమా పాటలతో పాటు అన్ని​ స్టయిల్స్​ పాడేవాడు. పాత సినిమా పాటలన్నీ అమ్మ పాడేది. అవన్నీ వింటూ  నాకూ పాడటం అలవాటయింది. ట్యూన్స్​ కూడా కట్టేవాడ్ని. కాకపోతే చిన్నప్పుడు కాస్త సిగ్గు ఎక్కువ నాకు. దానివల్ల స్టేజ్​ షోలు, కాంపిటీషన్స్​లో కాన్ఫిడెంట్​గా ఉండేవాడ్ని కాదు. ఆ బెరుకు వల్లే కర్ణాటక సంగీతం కూడా నేర్చుకోలేకపోయా. అయితే నేను చదువుకుంటున్న  ఆల్​ సెయింట్​ స్కూల్​లో  రామాచారిగారు మ్యూజిక్​ టీచర్​గా పనిచేసేవాళ్లు. ఆయన మాతో ఆల్​ ఇండియా రేడియోలో, స్టేజ్​ షోలలో పాడించేవాళ్లు. ఆ పాటలన్నీ కూడా ఆయన కంపోజిషన్సే. అలా పాడటంతో కాన్ఫిడెన్స్​ పెరిగింది. కానీ, మ్యూజిక్​నే ప్రొఫెషన్​గా మార్చుకోవాలన్న ఆలోచన లేకపోవడంతో పాటల్ని అంత సీరియస్​గా తీసుకోలేదు. 

ఆ తర్వాత..

ఇంటర్​ పూర్తయింది.. నెక్స్ట్​​ ఏంటి అన్న క్వశ్చన్​​ లేకుండా ఇంట్లో వాళ్లు బీటెక్​లో చేర్చారు. మరో ఆలోచనేం లేకపోవడంతో నేను కూడా ఏం మాట్లాడలేదు. కాలేజీకి వెళ్తే చుట్టూ నాలాంటి మ్యూజిక్​ లవర్సే. వాళ్ల ద్వారా వెస్ట్రన్​, పాప్​, రాక్​ మ్యూజిక్​ నేర్చుకునే అవకాశం వచ్చింది. ఫ్రెండ్స్​ అందరం కలిసి ఒక బ్యాండ్​ కూడా పెట్టాం. రానురాను మ్యూజిక్​  ప్యాషన్​గా మారింది. కానీ.. ప్రొఫెషనల్​గా నేర్చుకోవాలంటే అప్పట్లో బయటి దేశాలకి వెళ్లాల్సిందే. అంత బడ్జెట్ లేదు... పైగా ధైర్యం చేసి వెళ్లినా సీటు వస్తుందో, లేదో చెప్పలేం. అందుకే  చుట్టూ ఉన్న సోర్స్​ల ద్వారానే మ్యూజిక్​ నేర్చుకునే ప్రయత్నం చేశా. ఇంటర్నెట్​లో మ్యూజిక్ థియరీ, వెస్ట్రన్​ హార్మోనీ​ లాంటివి నేర్చుకున్నా.  మా అన్నయ్య ఫ్రెండ్​ దగ్గర గిటార్​ నేర్చుకున్నా.  ఇన్నింటి మధ్య చదువు ఎలా సాగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు! అరకొర మార్కులతో బీటెక్​ గట్టెక్కా. ఆ తర్వాత ఫ్రెండ్స్​ అంతా జీఆర్ఏ​ , జీమ్యాట్​ ప్రిపరేషన్​లో మునిగిపోయారు. నేనేమో మ్యూజిక్​లోనే ఉంటానని ఇంట్లో తేల్చి చెప్పా.  తెలియని ఫీల్డ్​ కావడంతో  అమ్మానాన్న మొదట టెన్షన్​ పడ్డారు. వద్దన్నారు. కానీ, ఆ తర్వాత నా ప్యాషన్​ని అర్థం చేసుకుని సపోర్ట్​ చేశారు. అయితే అప్పటికీ సినిమాల్లోకి రావాలన్న ఆలోచన లేదు నాకు. ఎలాగైనా మ్యూజిక్​లో ఉండాలనుకున్నా అంతే. 

బ్యూటిఫుల్ ఎక్స్​పీరియెన్స్​. కానీ.. 

పాడటం ఒక  బ్యూటీఫుల్​ ఎక్స్​పీరియెన్స్​. కానీ, మ్యూజిక్​ డైరెక్షన్​ అంటే టెక్స్చర్​, రిథమ్స్​, ట్యూన్స్​ అన్నీ  చూసుకోవచ్చు.  డిఫరెంట్​ ఎలిమెంట్స్​ని ఎక్స్​ప్లోర్​ చేయొచ్చు. పైగా ఏదైనా పాట ప్లే అవుతుంటే దాని బ్యాక్​ గ్రౌండ్​లో ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ఎక్కువ నాకు. అందుకే మ్యూజిక్​ డైరెక్షన్​ని ఎంచుకున్నా. నా ఫ్రెండ్స్​ సంజయ్​, ఫణితో కలిసి ‘కాథర్సిస్’​ అనే కర్నాటక​ ఇనుస్ట్రుమెంటల్​ బ్యాండ్​ని ఫామ్​ చేశా. సొంతంగా ట్యూన్స్​ కట్టి.. లిరిక్స్​ రాసి పాడేవాళ్లం. పబ్​లు, ఫెస్ట్​లలోనూ పర్ఫార్మెన్స్​లు ఇచ్చేవాళ్లం. ఏ ఆర్​ రెహ్మాన్​ కండక్ట్​ చేసిన బ్యాండ్స్​ కాంపిటీషన్​లోనూ పార్టిసిపేట్ చేసి ఫైనల్స్​ వరకు వెళ్లాం. ‘సౌండ్​ ఫ్లవర్’ ​​లాంటి పేజీలలోనూ మా మ్యూజిక్​ని అప్​లోడ్​ చేశాం. వాటి ద్వారా కాస్త ఫ్యాన్​ బేస్​ పెరిగింది. అవి విని యూకే నుంచి వచ్చి ఒకతను ‘సినిమా చేద్దాం’ అన్నాడు. ఆరు ఏడు పాటలకి మ్యూజిక్​ చేశాక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. కానీ, దాని ద్వారా ఫిల్మ్​ మ్యూజిక్​  కంపోజిషన్​ ఎలా చేయాలో తెలిసింది.  ఆ టైంలోనే నేనూ, సంజయ్​ కలిసి‘ టేప్​లూప్’​  ద్వారా మ్యూజిక్​ ప్రొడక్షన్​ అండ్​ రికార్డింగ్​ని  స్టార్ట్​ చేశాం. కార్పొరేట్​, వెడ్డింగ్, యాడ్​ ఫిల్మ్స్​, డాక్యుమెంటరీల​కి మ్యూజిక్​ చేయడం మొదలుపెట్టాం. ఆ ప్రాసెస్​లోనే డైరెక్టర్​ తరుణ్​ భాస్కర్​ పరిచయమయ్యాడు. తన డైరెక్షన్​లో నేను మ్యూజిక్​ చేసిన ‘సైన్మా’ అనే షార్ట్​ ఫిల్మ్​కి మంచి రెస్పాన్స్​ వచ్చింది.  దాంతో తన డెబ్యూ సినిమా ‘పెళ్లిచూపుల’కి నాకే అవకాశం ఇచ్చాడు తరుణ్​. అయితే ఆ సినిమా కంటే ముందే ‘రేస్’​ అనే సినిమాకి మ్యూజిక్​ ఇచ్చా. కాకపోతే అందరూ ‘పెళ్లిచూపులు’ సినిమానే నా డెబ్యూ అనుకుంటారు.

ఫ్రీడమ్​ ఇచ్చాడు

ముందు చెప్పినట్టుగా పెద్దపెద్ద సినిమాలకి మ్యూజిక్​ చేయాలి. అవార్డులు తీసుకోవాలన్న ఆలోచనలు లేవు నాకు. ఉన్నంత కాలం మ్యూజిక్​లోనే అనుకున్నా. అందుకే డాక్యుమెంటరీలు, కార్పొరేట్​ ఫిల్మ్స్​, జింగిల్స్​ అన్నింటికీ మ్యూజిక్​ చేశా. పెళ్లిచూపులు సినిమాని కూడా ఒక లెర్నింగ్​ ప్రాసెస్​ అనుకున్నా. నా పని నేను చేసుకుంటూ పోయా.  రొటీన్​కి  కాస్త భిన్నంగా సినిమాలోని అన్నీ పాటలు లిప్​సింక్​లోనే ట్రై చేశా. స్ట్రీట్​ స్టయిల్​ మ్యూజిక్​ని  తీసుకున్నా. ఈ విషయంలో తరుణ్​ భాస్కర్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. అందుకే అవుట్​పుట్​ అంత బాగా వచ్చింది. ఈ సినిమా తర్వాత  వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి.  

అలాంటి పాటలు చేయను

రొటీన్​ ఫార్ములా మ్యూజిక్​ నాకు నచ్చదు. అంటే హీరో ఎంట్రీ సాంగ్​.. ఆ నెక్స్ట్​ ఒక ఐటమ్​ సాంగ్​.. లవ్​ సాంగ్ ప్యాటర్న్ అన్నమాట. అందుకే ‘యుద్ధం శరణం, ఈ నగరానికి ఏమైంది, ఫలక్​నుమాదాస్, బ్రోచేవారెవరురా, హిట్​, పిట్టకథలు, సమ్మోహనం, రాజ రాజ చోర...’ లాంటి కథాబలం ఉన్న సినిమాల్నే ఎక్కువగా ఎంచుకున్నా. వీటిల్లోని పాటలన్నీ కథ డిమాండ్​ చేసినవే. నా దగ్గరికి ఏ సినిమా వచ్చినా మొదట కథ వింటా నచ్చితేనే ‘ఓకే’ చెప్తా. అంతే తప్పించి ఏ విషయంలోనూ కాంప్రమైజ్​ అవ్వను. మరి డబ్బు ఎలా? అన్న క్వశ్చన్​ చాలామందికి రావొచ్చు.  డాక్యుమెంటరీలు, ప్రైవేట్​ కాన్సెప్ట్​లతో  ఐదోపదో మిగులుతాయి. అలాంటప్పుడు డబ్బు కోసం సినిమాలు చేయాలా? అనిపిస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా నచ్చకుండా పనిచేస్తే అవుట్​పుట్​ సరిగా రాదనేది నా ఫీలింగ్​.  అలాగే నేను ట్యూన్​ కట్టినా మొదట అది నాకు కనెక్ట్​ అవ్వాలి. 

ఇంకాస్త బెటర్​గా .. 

ఆడియెన్స్​కి నా పాటలు నచ్చుతున్నాయి. అవార్డులు కూడా వస్తున్నాయి. కానీ, ఇప్పటివరకు నేను చేసిన ఏ పాట నాకు పూర్తి స్థాయిలో సంతృప్తినివ్వలేదు. ప్రతీది ఇంకాస్త బెటర్​గా చేసి ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంటుంది. చేసేటప్పుడు వావ్​ అనిపించిన ట్యూన్స్​ కూడా  ఇంకా బాగా చేయాల్సిందేమో అనుకుంటుంటా. దానికి కారణం రోజు రోజుకి మ్యూజిక్​లో బెటర్​ అవ్వడమే .  
::: ఆవుల యమున

పర్సనల్​ లైఫ్​ విషయానికొస్తే ఈ మధ్యే పెండ్లి అయింది. లవ్​ కమ్​ ఎరేంజ్డ్​ మ్యారేజ్​ నాది. నా భార్య కీర్తి వెడ్డింగ్​ ఫిల్మ్​ కంపెనీ నడుపుతోంది. రోజులో ఎక్కువ టైం  మ్యూజిక్​తోనే గడుపుతా నేను. కాస్త బ్రేక్​ దొరికితే ఫ్యామిలీతో టైం స్పెండ్​ చేస్తా. వీడియో గేమ్స్​ బాగా ఆడతా. డాక్యుమెంటరీలు ఎక్కువగా చూస్తా. ఫ్రెండ్స్​తో  బాతాఖానీ కొడతా. పల్లెటూరి వాతావరణమంటే చాలా ఇష్టం. ప్రస్తుతం నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా చేస్తోన్న ‘అంటే.. సుందరానికి’ , ఇంద్రగంటి మోహన కృష్ణగారి డైరెక్షన్​లో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్​ రిలీజ్​కి రెడీగా ఉన్నాయి.  

కమర్షియల్ మూస​ సినిమాల నుంచి బయటికొస్తున్నారు ఆడియెన్స్​. దాంతో ఇప్పుడు కథలే హీరోలు అవుతున్నాయి. అందుకు తగ్గట్టే మ్యూజిక్​ కూడా మారుతోంది.. మ్యూజిక్​ డైరెక్టర్ల ఆలోచనల్ని మారుస్తోంది. తెచ్చిపెట్టినట్టు కాకుండా కథలో భాగంగానే పాటలు కడుతున్నారు ఈతరం మ్యూజిక్​ డైరెక్టర్లు. అలా కథని నడిపించే ట్యూన్స్​ చేస్తున్న మ్యుజీషియన్స్​లో వివేక్​ సాగర్​ ఒకడు. ‘పెళ్లిచూపులు’తో మొదలుపెట్టి ‘యుద్ధం శరణం, ఫలక్​నుమా దాస్​, బ్రోచేవారెవరురా​..’ లాంటి మరెన్నో హిట్ సినిమాలకి ట్యూన్స్​ కట్టాడు ఈ యంగ్ మ్యుజీషియన్​. బ్యాక్​గ్రౌండ్​ స్కోర్స్​తో సీన్స్​కి ప్రాణం పోస్తున్నాడు. టాలీవుడ్ సినిమాలకి తన మ్యూజిక్​తో కొత్త ఫ్లేవర్స్​ అద్దుతున్న ఈ యంగ్​ టాలెంట్ గురించి మరిన్ని విశేషాలు..