లాక్డౌన్ సూపర్ హిట్ సాంగ్ ‘జెరుసలేమా’ .. 23 కోట్లు దాటిన వ్యూస్

లాక్డౌన్ సూపర్ హిట్ సాంగ్ ‘జెరుసలేమా’ .. 23 కోట్లు దాటిన వ్యూస్

ఎలాంటి అంచనాలు లేవు.. సాదా సీదా గా పాటను రికార్డు చేశారు… ఎవరికి నచ్చినట్లు వారు డ్యాన్సులు చేసిన వీడియో క్లిప్ లను మిక్స్ చేసి పాటగా మలిచారు. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న సమయంలో గతేడాది డిసెంబర్ 12న పాట రిలీజ్ అయింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ సాంగ్ వ్యూస్ షేక్ చేయడం ప్రారంభించాయి. చూసిన వాళ్లంతా.. ఓహ్.. సూపర్ అనుకుంటూ.. షేర్ చేస్తుంటే వ్యూస్.. డౌన్లోడ్స్ సంఖ్య రాకెట్ వేగంతో పెరిగిపోయింది. యూ ట్యూబ్ లో ట్రెండింగ్ కావడమే కాదు..  ప్రపంచ వ్యాప్తంగా కరోనా లాక్డౌన్ సమయంలో సూపర్ డూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది. కరోనా కంటే వేగంగా ప్రపంచ వ్యాప్తంగా పాటను చూసే వారు.. చూస్తున్న వారి సంఖ్య పెరుగుతూపోయింది. ఇప్పటి వరకు వ్యూస్  23 కోట్లు దాటాయి. ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

దక్షిణాఫ్రికా మ్యూజిక్ డైరెక్టర్, మాస్టర్ కేజి గా పాపులర్ అయిన  గావుగేలో మొవాగీ.. నోసెంబో జీకోడ్ తో కలసి పాడారు ఈ పాటను. జెరూసలేం నుండి ప్రపంచ వ్యాప్తంగా వలస వెళ్లిన వారి ఆవేదనను హృదయాన్ని తాకేలా తెలియజేశారు. ఇది నా ఇల్లు.. ఇది  నా జెరుసలెం.. నన్ను వదిలి వెళ్లొద్దు..  నాతో ఉండండి.. నాతో నడవండి.. అంటూ చిన్న చిన్న పదాలతో సాగుతుంది. అంతర్యుద్ధాలతో దెబ్బతిని.. నష్టపోయి విదేశాలకు వలస వెళ్లిన వారు.. వెళ్లే వారి ఆవేదన గుండెల్లో గుచ్చుకుంటాయి. ఎక్కడా గ్రాఫిక్స్ మాయాజాలం గాని.. ఓవరాక్షన్ కు అవకాశం లేకుండా చాలా సహజంగా చిత్రీకరించడం.. అంతే నేచురల్ గా డ్యాన్సులు చేయడం..  ప్రపంచం మొత్తానికి నచ్చింది. అందుకే యూట్యూబ్ లో ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ గా ట్రెండ్ సెట్టర్ అయింది.