కరోనాతో లోక్​పాల్​ మెంబర్​ మృతి

కరోనాతో లోక్​పాల్​ మెంబర్​ మృతి

ఎయిమ్స్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయిన జస్టిస్​ ఏకే త్రిపాఠి
న్యూఢిల్లీ: కరోనాతో లోక్​పాల్​ మెంబర్​ చనిపోయారు. నలుగురు లోక్​పాల్​ సభ్యుల్లో జస్టిస్​ అజయ్​కుమార్​ త్రిపాఠి ఒకరు. పోయిన నెల 2న ఆయన కరోనా లక్షణాలతో ఢిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు. ఏప్రిల్​5న పాజిటివ్​గా తేలింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. క్రిటికల్​ కేర్​ యూనిట్​లో ఇన్నాళ్లు ఆయనకు వెంటిలేటర్​పై ట్రీట్​మెంట్​ చేశారు.

పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి ఆయన కన్నుమూశారు. ఇంతకుముందు ఆయన ఛత్తీస్​గఢ్​ చీఫ్​ జస్టిస్​గా పనిచేశారు. బీహార్​ అడిషనల్​ అడ్వొకేట్​ జనరల్​గానూ సేవలందించారు. ఆ తర్వాత పాట్నా హైకోర్టుకు అడిషనల్​ జడ్జిగా ప్రమోషన్​ పొందారు. కొన్నాళ్లకు అదే హైకోర్టుకు చీఫ్​ జస్టిస్​ అయ్యారు. పోయినేడాది మార్చి 23న లోక్​పాల్​ సభ్యుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.