పార్లమెంట్ ఎన్నికలు : ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల

పార్లమెంట్ ఎన్నికలు : ఓటర్ల ఫైనల్ లిస్ట్ విడుదల

పార్లమెంట్  ఎన్నికల కోసం ఓటర్ల తుది  జాబితాను ప్రకటించింది  ఈసీ. తెలంగాణలో  మొత్తం  2 కోట్ల 95 లక్షల  ఓటర్లు  ఉన్నారని తెలిపింది. ఫైనల్ లిస్టులో పేరు లేని వారి కోసం మార్చి 2,3 తేదిల్లో ప్రత్యేక క్యాంపులు  ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని  ఓటర్లను కోరింది. తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 2 కోట్ల 95 లక్షల 18 వేల 964 మందిగా ప్రకటించింది. ఇందులో పురుష ఓటర్లు కోటి 48 లక్షల 48 వేలు కాగా, మహిళా ఓటర్లు కోటి 46 లక్షల 74 వేలు మంది ఉన్నారని తెలిపింది. థర్డ్ జెండర్ ఓటర్లు 10 వేలకు పైగా ఉన్నారని పేర్కొంది. ప్రవాస ఓటర్లు 11 వందల 22 మంది ఉన్నారని తెలుపింది.

వికలాంగ ఓటర్లు 4 లక్షల 69 వేల మంది ఉండగా…18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్లు 5 లక్షల 99 వేల 933 ఉన్నారని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల నమోదు కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది ఈసీ. ఈ డ్రైవ్ లో కొత్త ఓటర్లు, అడ్రస్ మార్పు, ఫిర్యాదులు, అభ్యంతరాలు, కొత్త ఓటర్ల నమోదు కు సంబంధించి మొత్తం 26 లక్షల 23 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులన్నింటిని పరిశీలించిన ఈసీ 23 లక్షల 78 వేల దరఖాస్తులను ఆమోదించింది. 2 లక్షల 45 వేల దరఖాస్తులను తిరస్కరించింది. ఈ డ్రైవ్ లో 18 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన 5 లక్షల 99 వేల మంది నమోదు చేసుకున్నట్లు రజత్ కుమార్ చెప్పారు.

చివరగా ఓటర్ల నమోదు కోసం మరో అవకాశాన్ని కల్పించింది ఈసీ. ఇందుకోసం మార్చి 2,3 తేదిల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. ఈ క్యాంపుల్లో బూత్ లెవల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారని వారి దగ్గర దరఖాస్తులు ఉంటాయని ఈసీ రజత్ కుమార్ చెప్పారు. ఈ దరఖాస్తులను మార్చి 14 వరకు పరిశీలించి ఓటరుగా నమోదు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణలో మొత్తం 2 కోట్ల 80 లక్షల 64 వేల 684 మంది ఓటర్లు ఉండగా పార్లమెంట్ ఎన్నికల కోసం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ తర్వాత ఓటర్ల సంఖ్య 2 కోట్ల 95  లక్షల 18 వేల 964 కు చేరింది. మొత్తంగా కొత్తగా 14 లక్షల 54 వేల 280 మంది ఓటర్లు  పెరిగినట్లు ఈసీ తుది జాబితాలో తెలిపింది.