గన్నేరువరం మండల కేంద్రంలో ఇంటి పైకి దూసుకెళ్లిన లారీ

గన్నేరువరం మండల కేంద్రంలో ఇంటి పైకి దూసుకెళ్లిన లారీ

గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో గురువారం రాత్రి వడ్ల లోడుతో వెళ్తున్న లారీ ఓ ఇంటిపైకి దూసుకెళ్లింది. మండలకేంద్రం నుంచి బయలుదేరిన పనగడి  చౌరస్తా వద్ద మూలమలుపు తిరుగుతుండగా అదుపుతప్పి బుర్ర శ్రీనివాస్ ఇంటి పైకి దూసుకెళ్లింది.  

ముందు టైరు డ్రైనేజీలో పడడంతో లారీ ఇంటి కప్పుపైకి ఒరిగింది. దీంతో ఇంట్లో ఉన్న వాళ్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రోడ్డుకు అడ్డంగా లారీ ఉండడంతో  శుక్రవారం మండల కేంద్రానికి బస్సులు రాలేదు. మండల కేంద్రంలో  రోడ్డు ఇరుగ్గా ఉండటమే ప్రమాదాలకు కారణమని స్థానికులు వాపోతున్నారు.