
ఇద్దరి ప్రాణాలను తీసి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ప్రేమోన్మాది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లోని బింద్వారా గ్రామంలో జరిగింది. బంటి రాజస్ (25) అనే అతను తన ఇంటి పక్కన ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వేధించాడు. దీంతో ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంటిని పోలీసులు పిలిపించి అడుగగా.. తాను మరోసారి ఆఅమ్మయిని వేధించనని చెప్పాడు.
తన ప్రేమను కాదన్నందుకు బంటి ఆ అమ్మాయిపై పగను పెంచుకున్నాడు బంటి. ఆ అమ్మాయి తండ్రి, సోదరుడు వేరే ఊరికి వెళ్లారని తెలిసి గురువారం రాత్రి వాళ్ల ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని చాకుతో విచక్షణారహితంగా పొడిచాడు. ఇందుకు అడ్డువచ్చిన ఆ అమ్మాయి తల్లిపై కూడా చాకుతో దాడి చేశాడు . వాళ్ల అరుపులకు చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి నుంచి పారిపోయిన బంటి అదే ఊర్లోని చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలతో ఉన్న తల్లీ కూతుర్లు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసును నమోదు చేసుకున్నారు పోలీసులు.