మాచారం మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ కు గోల్డ్ మెడల్

మాచారం మహిళా ఫారెస్ట్ ఆఫీసర్ కు గోల్డ్ మెడల్
  • మాచారం ఎఫ్ఎస్​వోకు అరుదైన గౌరవం
  • గోల్డ్​ మెడల్​కు ఎంపికైన మహిళా ఫారెస్టర్

అమ్రాబాద్, వెలుగు: నాగర్​కర్నూల్​ జిల్లా అమ్రాబాద్  టైగర్  రిజర్వ్‌‌ లోని మాచారం సెక్షన్  ఆఫీసర్ గా పని చేస్తున్న ఎం.భాగ్యమ్మ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అటవీ సంరక్షణ కోసం విశేష సేవలందించిన ఆమె కేవీఎస్  బాబు, ఐఎఫ్ఎస్  స్మారక స్వర్ణపతకం–2025కు ఎంపికయ్యారు. 

మంగళవారం హైదరాబాద్ లోని దూలపల్లి ఫారెస్ట్​ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో పీసీసీఎఫ్ సువర్ణ, చీఫ్  వైల్డ్‌‌  లైఫ్  వార్డెన్  ఎలుసింగ్  మేరు గోల్డ్​ మెడల్​ను ఆమెకు అందజేసి అభినందించా. 16 ఏండ్లుగా అటవీ శాఖలో సేవలందిస్తున్న భాగ్యమ్మ అవార్డుకు ఎంపిక కావడం పట్ల జిల్లా అటవీ శాఖ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.