యూట్యూబర్కు రూ.50లక్షల ఫైన్ విధించిన మద్రాస్ కోర్టు

యూట్యూబర్కు రూ.50లక్షల ఫైన్ విధించిన మద్రాస్ కోర్టు

చెన్నై: ఏఐడీఎమ్ కే స్పోక్ పర్సన్, ట్రాన్స్ జెండర్ అప్సరారెడ్డిపై ట్రోల్ చేసిన యూట్యూబర్ మైఖెల్ ప్రవీణ్ కు మద్రాస్ హైకోర్టు రూ.50లక్షల ఫైన్ విధించింది. ఆ మొత్తాన్ని అప్సరారెడ్డికి చెల్లించాలని ఆదేశించింది. తనపై ట్రోల్స్ వీడియోస్ చేసి యూట్యూబర్ ప్రవీణ్ తనను ఇబ్బందులకు గురిచేశాడని, తీరని నష్టాన్ని  కలిగించాడని ఆమె మద్రాస్ హై కోర్టును ఆశ్రయించింది. తనకు రూ.1.25 కోట్లను 36 శాతం వడ్డీతో నష్టపరిహారం ఇప్పించాలని కోర్టును కోరింది. 

తాను ఓ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్న సమయంలో యూట్యూబర్ తో జాయింట్ ప్రోగ్రామ్ చేసేందుకు నిరాకరించినందుకే మైఖెల్ ఇలా ట్రోల్స్ చేసినట్లు కోర్టుకు తెలిపింది. యూట్యూబ్ లో తన వీడియోలు  కూడా డిలీట్ చేయించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన  కోర్టు..మైఖేల్ ఈ మేరకు ఆదేశాలు  జారీ చేసింది. ఓ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేసే హక్కు వ్యక్తికి ఉంటుందని.. అలాంటి సమయంలో లిమిట్స్ క్రాస్ చేయోద్దని కోర్టు అభిప్రాయపడింది. అవి ఇతరుల ప్రైవసీకి ఇబ్బందులు కలిగించవద్దని పేర్కొంది.