హైదరాబాద్, వెలుగు: మెగల్లానిక్ క్లౌడ్ లిమిటెడ్ డిఫెన్స్ టెక్నాలజీ రంగంలో అడుగుపెడుతూ రేయోనిక్స్ టెక్‌తో కలిసి 11 మిలియన్ డాలర్ల (సుమారు రూ.100 కోట్లు) విలువైన జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. ఇజ్రాయెల్ సంస్థ ఎక్స్టెండ్ సహకారంతో అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీలు) తయారు చేయనుంది.
దేశీయంగా డ్రోన్ల తయారీ, పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. ఎక్స్టెండ్ అభివృద్ధి చేసిన ఎక్స్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈ డ్రోన్లకు వెన్నెముకగా ఉంటుంది. ఏఐ ఆధారిత నావిగేషన్, మిషన్ ప్లానింగ్ ద్వారా రక్షణ రంగ అవసరాలను ఇవి తీరుస్తాయి. స్కార్పియో 500, వోల్వరీన్ వంటి అత్యాధునిక డ్రోన్లను ఈ జాయింట్ వెంచర్ ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఆధునిక యుద్ధ తంత్రానికి అవసరమైన డిజిటల్ వ్యవస్థను అందిస్తున్నామని మెగల్లానిక్ క్లౌడ్ ఎండీ జోసెఫ్ తెలిపారు.

