వనపర్తి/అలంపూర్/మక్తల్/అమ్రాబాద్, వెలుగు : భవిష్యత్‌లో సంభవించే ఎలాంటి విపత్తులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట కలెక్టర్లు ఆదర్శ్ సురభి, హేమంత కేశవ్ పాటిల్, సీహెచ్ ప్రియాంక జోగులాంబ గద్వాల అడిషనల్ కలెక్టర్ మధు మోహన్ స్పష్టం చేశారు.
సోమవారం వనపర్తిలోని నల్ల చెరువు, అలంపూర్‌లోని తుంగభద్ర పుష్కర ఘాట్, నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, వైద్య శాఖల సమన్వయంతో భారీ స్థాయి మాక్ డ్రిల్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా బోట్ల సాయంతో వరద బాధితులను రక్షించడం, ప్రథమ చికిత్స అందించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అటవీ అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ లైన్ల నిర్మాణం లాంటి చర్యలను ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు.
