
మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని CMR షాపింగ్ మాల్ లో జరిగిన చోరీని పోలీసులు ఛేదించారు. షాపింగ్ మాల్‌లో పనిచేస్తున్న సిబ్బందే చేతివాటం ప్రదర్శించి, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలను దొంగిలించారని తేల్చారు. నగలు కాజేసిన ఏడుగురు నిందితులను వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 38 తులాల బంగారు నగలు, రూ.6లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి మీడియాకి వెల్లడించారు.