హైదరాబాద్ సిటీ, వెలుగు: మహానగరాన గణేశ్నిమజ్జన జోష్ ఇంకా నడుస్తోంది. 11 రోజులు ‘ఘన’ పూజలు చేసిన భక్తులకు.. అప్పుడే గణపయ్యను గంగమ్మ ఒడికి సాగనంపడం ఇష్టం లేదేమో.. మంగళవారం ఆలస్యంగా నిమజ్జనాలకు బయలుదేరారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు నగరంలోని ప్రధాన రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. హుస్సేన్సాగర్తీరం లోని ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్‌తో పాటు సిటీలోని ఇతర ప్రధాన చెరువులు బోసిపోయి కనిపించాయి. ఎప్పుడూ రాత్రి 8 గంటలు దాటిన తర్వాతే నిమజ్జనమయ్యే బాలాపూర్ గణేశుడు ఈసారి ఎక్కడా ట్రాఫిక్ లేకపోవడంతో నాలుగ్గంటలకే గంగమ్మ ఒడి చేరాడు.
ఉదయం వేళలో ఖైరతాబాద్బడా గణపతి శోభాయాత్ర చూసేందుకు లక్షల్లో తరలివచ్చిన జనం మినహా హుస్సేన్సాగర్తీరంలో పెద్దగా జనం కనిపించలేదు. సాయంత్రం నుంచి ఒక్కొక్కటిగా వినాయక విగ్రహాలు బయలుదేరడంతో రోడ్లన్నీ రద్దీగా మారాయి. పలుచోట్ల ట్రాఫిక్జామ్స్ఏర్పడ్డాయి. చార్మినార్, మొజంజాహీ మార్కెట్, బషీర్‌బాగ్, లిబర్టీ ప్రాంతాలు జనంతో కిక్కిరిశాయి. ఒక్కసారిగా రష్ పెరగడంతో మంగళవారం అర్ధరాత్రితో నిమజ్జనాలు పూర్తవుతాయని కాన్పిడెంట్‌గా ఉన్న అధికారులు బుధవారం ఉదయంలోపు పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇది మధ్యాహ్నం వరకూ కొనసాగుతుందనే అంచనాతో స్పీడ్‌గా నిమజ్జనాలు కొనసాగిస్తున్నారు.