‘ప్రేమ పెళ్లి చేసుకోం’ కాలేజీ గర్ల్స్ ప్రతిజ్ఞ

‘ప్రేమ పెళ్లి చేసుకోం’ కాలేజీ గర్ల్స్ ప్రతిజ్ఞ

అమ్మాయిలతో ప్రమాణం చేయించిన మహారాష్ట్ర కాలేజీ

‘‘నా తల్లిదండ్రులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నేను ప్రేమలో పడను. ప్రేమ పెళ్లి చేసుకోను. అంతేకాకుండా కట్నం అడిగే వాడితోనూ పెళ్లికి ఒప్పుకోను” అని ప్రమాణం చేశారు మహారాష్ట్రలోని గర్ల్స్ కాలేజీ స్టూడెంట్స్. వాలంటైన్స్ డే (ఫిబ్రవరి 14) రోజున ప్రేమకు వ్యతిరేకంగా కాలేజీ మేనేజ్ మెంట్ స్టూడెంట్స్​తో ఇలా మరాఠీలో ప్రతిజ్ఞ చేయించింది. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా చండూర్ రైల్వే ప్రాంతంలోని మహిళా ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ఈ ఘటన జరిగింది.  లవ్ మ్యారేజ్ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ నుంచి సలహా తీసుకోవాలని ఒక అమ్మాయి అభిప్రాయపడగా… ‘‘అసలు లవ్ మ్యారేజ్ అవసరమేంటి? మనకేం కావాలో మన పేరెంట్స్​కు తెలుసు కదా. వాళ్లే మనకు సరిపడే వాడినే చూస్తారు” అని ఇంకో అమ్మాయి తెలిపింది. ‘‘ఎవరి మాటలకో కట్టుబడి స్టూడెంట్స్ ఈ ప్రమాణం చేయలేదు. వార్దా లాంటి ఘటనల విషయంలో స్టూడెంట్లను అలెర్ట్ చేసేందుకే కాలేజీ ఇలా ప్రమాణం చేయించింది” అని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్ మెంట్ మినిస్టర్ యశోమతి ఠాకూర్ అన్నారు. ఇటీవల వార్దాలో ఓ లేడీ లెక్చరర్​ను ప్రేమ పేరుతో ఓ వ్యక్తి పెట్రోల్​తో నిప్పంటించి చంపేసిన సంగతి తెలిసిందే.