మహేష్ బ్యాంక్ నిధులు కొట్టేసిన నేరగాళ్ల అరెస్ట్

మహేష్ బ్యాంక్ నిధులు కొట్టేసిన నేరగాళ్ల అరెస్ట్
  • 3 బ్యాంకుల్లో 14 కోట్లు హ్యాకింగ్ అవ్వగా 9.4 కోట్లు లాస్ అయింది
  • 23 మంది నిందితులను అరెస్టు చేశాం
  • బ్యాంకులు ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం: సీపీ సీవీ ఆనంద్

హైదరాబాద్: మహేశ్ బ్యాంకు నిధుల గోల్ మాల్ కేసులో పురోగతి సాధించారు పోలీసులు. దేశంలో ఉండి నైజీరియన్లకు సాయం చేసిన కీలక సూత్రధారిని అరెస్టు చేశారు. వంద మంది పోలీసులతో రెండు నెలలపాటు విచారణ చేపట్టామన్నారు సీపీ సీవీ ఆనంద్. విచారణకు 58 లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలిపారు. మహేశ్ బ్యాంకు కేసులో 23 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. బ్యాంకు సర్వర్లను హ్యాక్ చేసి 14 కోట్లు కొల్లగొట్టారన్నారు. నైజీరియా నుంచే సర్వర్లు హ్యాక్ చేసినట్లు గుర్తించారు. ఇప్పటి వరకు 3 బ్యాంకుల్లో నిధులు కొట్టేశారన్నారు సీపీ సీవీ ఆనంద్. ఆర్బీఐ నిబంధనలు పాటించకుండా.. బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తున్నాయన్నారు. బ్యాంకులు నిబంధనలు పాటించకుండా.. నిర్లక్ష్యం చేయడం వల్లే సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు.
జనవరి 24న బ్యాంక్ హ్యాకింగ్ కేసు నమోదు
ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో హ్యాకింగ్ కేసు జనవరి 24న నమోదైనప్పటి నుండి అరెస్టు చేసే వరకు జరిగిన విచారణ వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు క్లుప్తంగా వివరించారు. ఈ కేసు ఛాలెంజింగ్ గా తీసుకుని 23 మంది నిందితులను అరెస్డ్ చేశామన్నారు. ఈ కేసును చేధించడానికి రెండు నెలల పాటు వంద మంది పోలీసులకు టిఏ డిఏ 58 లక్షలు ఖర్చు అయిందన్నారు. బ్యాంకులు సరైన గైడ్లైన్స్ పాటించట్లేదు, ఆర్బీఐ చెప్పిన రూల్స్ బ్యాంకులు పాటించట్లేదని విచారణలో తేలిందన్నారు. 
హ్యాకింగ్ ఎలా జరిగిందంటే...
ప్రధాన హ్యాకర్ నైజీరియన్ ఎక్కడున్నాడో ఇంకా తెలియదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. మొదటగా రెండు వందల ఫిషింగ్ మెయిల్స్ మహేష్ బ్యాంక్ ఉద్యోగులకు పంపించాడని, ఇద్దరు ఉద్యోగులు ఆ ఫిషింగ్ మెయిల్స్ క్లిక్ చేశారని, అందులో ర్యాట్ సాఫ్డ్ వేర్ ఉండటంతో హ్యాకర్ చేతిలోకి బ్యాంక్ సాఫ్ట్ వేర్ వెళ్లిందన్నారు. కీ లాకర్ సాఫ్ట్ వేర్ ఆ సిస్టమ్స్ కి పంపించాడు.. దాంతో ఆ ఇద్దరు ఉద్యోగులు ఏం చేసినా తెలిసేలా చేసుకున్నాడు హ్యాకర్.
ఉద్యోగులు కంప్యూటర్లు షట్ డౌన్ చేసిన తర్వాత హ్యాకర్ వారి సిస్టమ్స్ ను ఓపెన్ చేశాడు. 
మహేష్ బ్యాంక్ లో ఉన్న డాటా బేస్ ఆపరేట్ చేసే సూపర్ అడ్మిన్స్ లాగిన్ పాస్ వర్డ్ తీసుకున్నాడు. 
ఆ డాటా బేస్ లోకి వెళ్లి ట్రాన్సక్షన్ చేసుకున్నాడు
ఈ బ్యాంకులో సాఫ్ట్ వేర్ ఒకటే నెట్ వర్క్ పైన నడుపుతున్నారు
మహేష్ బ్యాంక్ ఫైర్ వాల్స్ స్ట్రాంగ్ గా లేవు 
ఫిషింగ్ డిటెక్ట్ చేసే సాఫ్ట్ వేర్స్ కూడా సరిగా లేవు 
బ్యాంకులు కొంత ఖర్చు చేసి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి కానీ అలా తీసుకోలేదు
హ్యాకర్ కు పెద్ద టీం ఉంది 
వారు అంతా ఇండియాలో ఉన్నారు
వీళ్లంతా ఆ బ్యాంకులో ముందే అకౌంట్స్ ఓపెన్ చేశారు
నైజీరియన్స్ తో వీళ్లంతా టచ్ లో ఉంటూ అకౌంట్స్ ఓపెన్ చేశారు
డేటా బేస్ లోకి ఎంటరై వీరి అకౌంట్లో ఉన్న అమౌంట్ ను కోట్ల రూపాయలు గా చూపించారు హ్యాకర్
పది శాతం‌ కమిషన్ తో ఈ నాలుగు అకౌంట్ హోల్డర్స్ ద్వారా దేశ వ్యాప్తంగా 115 అకౌంట్లు ఓపెన్ చేయించారు. 
చైన్ సిస్టమ్ లా ఈ డబ్బులు అకౌంట్ టు అకౌంట్ మారుతూ ఫైనల్ గా నైజీరియన్స్ చేతుల్లోకి డబ్బులు చేరాయి. బ్యాంకింగ్ సిస్టమ్ మొత్తం డేంజర్ లో‌ ఉందని పోలీసుల విచారణలో బయటపడింది. 
హ్యాకర్లు విదేశాల్లో ఉండి డబ్బులు కొల్లగొడుతున్నట్లు గుర్తించారు. 
మెయిన్ హ్యాకర్ నైజేరియా లేదా యూకే లో ఉండి ఉండే అవకాశం ఉంది.
మెయిన్ హ్యాకర్ కింద ఇండియాలో పని చేసే ప్రధాన వ్యక్తి స్డీఫెన్ ఆర్జీని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు కోసం ఇంటర్ పోల్ ను‌ సంప్రదిస్తాం
రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేస్తాం
అది ఎంత పెద్ద ఎత్తున ప్రాసెస్ అయినా ఛేదిస్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. 
మహేష్ బ్యాంక్ కి ముంబై కి చెందిన ఇంట్రా సాఫ్ట్ డేవలపర్స్  సాఫ్ట్ వేర్ అందించారు.. వారిని కూడా విచారిస్తామన్నారు. మహేష్ బ్యాంక్ యాజమనాన్యం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు.. కాబట్టి వారిని కూడా నిందితులుగా చేరుస్తామన్నారు. ఆర్బీఐ గైడ్ లైన్స్ పరిశీలనకు ఒక ఎన్ఫోర్స్ మెంట్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మొత్తం 12.48 కోట్లు హ్యాకింగ్ అవ్వగా 9.4 కోట్లు లాస్ అయిందని సీపీ సీవీ ఆనంద్ వివరించారు. మీడియా సమావేశంలో సీవీ ఆనంద్ చెప్పిన వివరాలు కింది వీడియోలో చూడొచ్చు. 

 

 

ఇవి కూడా చదవండి

సికింద్రాబాద్ లో శుభకార్యానికి వెళ్లొచ్చేలోగా ఇల్లు దోపిడీ

ఎంబీబీఎస్ స్టూడెంట్కు వివేక్ వెంకటస్వామి నివాళి

ఈ ఆటో డ్రైవర్.. ఒకప్పుడు ఇంగ్లీష్​ టీచర్

ఫ్యాట్​ ఈజ్​ క్యూట్​ అంటూ ర్యాంప్​ వ్యాక్

జైల్లో చదివిండు ఐఐటీ ర్యాంకర్​​ అయ్యిండు