Tillu square: టిల్లు స్క్వైర్ ముగింపు మారింది.. ఆడియన్స్కు స్వీట్ సర్ప్రైజ్

Tillu square: టిల్లు స్క్వైర్ ముగింపు మారింది.. ఆడియన్స్కు స్వీట్ సర్ప్రైజ్

టిల్లు స్క్వైర్(Tillu square) తో టిల్లన్న మరోసారి థియేటర్స్ లో రచ్చ రచ్చ చేస్తున్నాడు. డీజే టిల్లుకి మించిన హంగామా చేస్తూ రికార్డ్ కలెక్షన్స్ రాబడుతున్నాడు. మర్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ హిలేరియస్ ఎంటర్టైనర్.. కేవలం మూడు రోజుల్లోనే రూ.60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి కలెక్షన్స్ సునామి సృష్టిస్తోంది. ఓపక్క ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్నా.. కలెక్షన్ల జోరు మాత్రం తగ్గడం లేదు. ఇదే ఊపు కొనసాగితే మరో రెండు మూడు రోజుల్లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. 

అయితే.. ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు టిల్లు స్క్వైర్ టీమ్ కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ సినిమాలో ఆడియన్స్ కోసం మరో స్వీట్ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. అదేంటంటే.. టిల్లు స్క్వైర్ సినిమాకు మరో సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా కూడా ప్రకటించారు. టిల్లు క్యూబ్ గా రానున్న ఈ సినిమా గురించి త్వరలోనే మిగతా వివరాలు ప్రకటించనున్నారు. కానీ, టిల్లు స్క్వైర్ ఎండింగ్ లో అలాంటి హిట్ ఏమీ ఇవ్వలేదు. 

దాంతో.. టిల్లు స్క్వైర్ కు సీక్వెల్ గా టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని ప్రకటిస్తూ ఒక షాట్ ను సినిమా ఎండింగ్ లో యాడ్ చేశారట మేకర్స్. ఈ అప్డేటెడ్ వర్షన్ సోమవారం(ఏప్రిల్ 1) నుండి యాడ్ అవుతుందని చెప్పుకొచ్చారు. కాబట్టి సోమవారం నుండి టిల్లు స్క్వైర్ సినిమా చూసేవాళ్లకి టిల్లు క్యూబ్ గురించి అప్డేట్ కనిపించే అవకాశం ఉండనుంది. అలా సినిమా ఎండింగ్ లో చిన్న క్లిప్ యాడ్ చేసి.. సీక్వెల్ పై ఆడియన్స్కు స్వీట్ సర్ప్రైజ్ ఇవ్వనున్నారు మేకర్స్.