Parvathy Thiruvothu: పార్వతి హోం టూర్ చూశారా..ఏకంగా 36@

Parvathy Thiruvothu: పార్వతి హోం టూర్ చూశారా..ఏకంగా 36@

మళయాళ ఇండస్ట్రీకి చెందిన పార్వతి తిరువోతు (Parvathy Thiruvothu) దూత వెబ్ సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. అందులో పోలీస్ ఆఫీసర్ గా నటించారు అనే కంటే ఆ పాత్రలో జీవించారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా ఎదుటివ్యక్తిని కళ్లతో చదివేసే పాత్రలో ఆమె అద్భుతమైన నటనను కనబరిచారు.

దూత సిరీస్ సక్సెస్ లో కీ రోల్ పోషించారు. అందుకే ఆమె గురించి తెలుసుకోవడానికి ఆడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందులో భాగంగా..తాజాగా పార్వతి తిరువోతు సోషల్‌ మీడియా ద్వారా తన హోం టూర్ ను ప్రేక్షకులకు మరియు తన ఫాలోవర్స్ కి చూపించింది.

ఈ వీడియోలో మూడు బెడ్‌ రూంలు కపిస్తుండగా..ఇక ఇంట్లో ఎక్కడ చూసినా చుట్టూ పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి. ఇంతలా పచ్చదనం పెరిగేలా చేస్తూ..ఆ పచ్చదనాన్ని ఆస్వాదిస్తున్న పార్వతిపై చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read :స్థిర శనివారం సమవర్తి..పోస్టర్ తోనే నాని హై లెవల్ ఇంపాక్ట్

ఇక పార్వతి వీడియోలో మాట్లాడుతూ..తన ఇంట్లో మామిడితో పాటు ఫ్రూట్‌ సలాడ్‌ కి కావాల్సిన అన్ని రకాల పండ్లు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చింది. తన ఇంట్లో మొత్తంగా 36 రకాల మొక్కలు ఉన్నాయి. వాటికి నేను తల్లి మాదిరిగా ప్రతి రోజు సేవ చేస్తాను అన్నట్లుగా వీడియోలో చెప్పుకొచ్చింది. ఏకంగా 36 రకాల మొక్కలను తన పిల్లల మాదిరిగా చూసుకోవడం చాలా గొప్ప విషయం అంటూ నెటిజన్స్ పార్వతిపై కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పార్వతి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

పార్వతి తిరువోతు విషయానికి వస్తే..

మళయాళ ఇండస్ట్రీకి చెందిన ఫేమస్ నటి. 2006లో నటిగా ప్రయాణం ప్రారంభించిన ఆమె.. దాదాపు 17 సంవత్సరాలుగా ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు. కేవలం మలయాళంలోనే కాదు తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించారు. ఉత్తమనటిగా అవార్డులను అందుకున్నారు. ఇక మొదటిసారిగా దూత సిరీస్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు పార్వతి తిరువోతు. మొదటి ఛాన్స్ తోనే తన నటనతో తెలుగు ఆడియన్స్ మనసులు గెలిచేసుకున్నారు. ఇక దూత సిరీస్ సక్సెస్ తో తెలుగులో కూడా ఆమెకు మంచి పాత్రలు వచ్చే అవకాశం ఉంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ArchPro (@arch.kerala)