మలయాళ హీరో జయసూర్య నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆడు 3’ (Aadu 3). ఇది మోస్ట్ సక్సెస్ ఫుల్ కామెడీ 'ఆడు' ఫ్రాంచైజీకి మూడో భాగంగా తెరకెక్కింది. మిధున్ థామస్ డైరెక్ట్ చేశాడు. మార్చి 19న థియేటర్లలో విడుదలై, బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించే వసూళ్లను సాధించింది. ఇపుడు ఈ కామెడీ ఫాంటసీ జీ5 ఓటీటీలోకి వచ్చి అలరిస్తుంది. కేవలం 7 గంటల్లోనే 10 కోట్లకి పైగా స్ట్రీమింగ్ నిమిషాలతో దూసుకెళ్తోంది. మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ మరియు హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో జయసూర్య ప్రధాన పాత్రలో నటించగా, విజయ్ బేబీ, సన్నీ వేన్, సైజు కురుప్, వినాయకన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.
ఇదొక టైం లూప్ కాన్సెప్ట్ మూవీ. టైమ్ లూప్ కాన్సెప్ట్‌ను కామెడీతో మిక్స్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ మూడు టైమ్‌లైన్స్‌కు తగినట్టుగా ఉన్నాయి. జయసూర్య మరోసారి షాజీ పాప్పన్ పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా వినాయకన్ పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
A milestone that speaks loud 🔥
— ZEE5 Malayalam (@zee5malayalam) May 2, 2026
100M+ streaming minutes in just 7 hours 💥#Aadu3 is now streaming on Malayalam Zee5.#Aadu3OnZee5 #MalayalamZee5 #Zee5 pic.twitter.com/q161fWKbau
కథేంటంటే:
షాజి పాప్పన్ (జయసూర్య) అతని గ్యాంగ్ మూడు పారలల్ టైమ్‌లైన్స్‌లో (గతం, వర్తమానం, భవిష్యత్) వివిధ రూపాల్లో ఉంటారు. భవిష్యత్తులో (2370 సంవత్సరం)భూమిపై సహజ వనరులు హరించుకుపోతాయి. ‘ది ఆర్గనైజేషన్’ అనే ఒక క్రూరమైన కార్పొరేట్ సంస్థ ప్రపంచాన్ని పాలిస్తుంటుంది. టైమ్‌లైన్స్ మార్చగల రేర్ సబ్‌స్టాన్స్ ‘స్టార్ డస్ట్’ కోసం వెతుకుతుంటారు.
►ALSO READ | నాగబాబు లీడ్ రోల్ లో మేము కాప్ లం వెబ్ సిరీస్..
వర్తమానంలో షాజీ పాప్పన్, అతని గ్యాంగ్ దగ్గర ఆడు–2 సినిమా క్లైమాక్స్‌లో దొరికిన అమెరికన్ డాలర్లు ఇంకా ఉంటాయి. వాటిని ఇండియన్ కరెన్సీలోకి మార్చుకునే క్రమంలో వాళ్లు అనుకోకుండా ఒక సమస్యలో ఇరుక్కుంటారు. ఇక గతంలోకి వెళ్తే (క్రీ.శ.1790లు) షాజీ పాప్పన్ ఒక చిన్న రాజ్యానికి రాజు (మహారాజా పద్మనాభన్ తంపురాన్)గా కనిపిస్తాడు.
అతను తన రాజ్యం మీదికి దండెత్తి వచ్చిన టిప్పు సుల్తాన్ సేనాధిపతి(వినాయకన్ )ని అడ్డుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఒక వంతెనను నాశనం చేయడం ద్వారా గతాన్ని మార్చడానికి పాప్పన్ గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ మూడు కథలకు లింక్ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాలి.
