
భోపాల్: మాలెగావ్ బాంబు పేలుళ్ల కేసులో తనను నిర్దోషిగా ప్రకటిస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పు హిందూత్వ విజయమని బీజేపీ మాజీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తెలిపారు. కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించిన వ్యక్తులకు ఇది చెంపపెట్టు అని అన్నారు. ఆదివారం భోపాల్ లో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘‘కోర్టు తీర్పు హిందూత్వం, కాషాయం విజయం. కాషాయ ఉగ్రవాదం అనే పదాన్ని సృష్టించిన వ్యక్తులకు సమాజం, దేశం తగిన సమాధానం ఇచ్చాయి.
కోర్టు తీర్పు ప్రత్యర్థులకు చెంపపెట్టు”అని ఆమె పేర్కొన్నారు. కొంత మంది ప్రముఖుల పేర్లు చెప్పాలని తనను ఒత్తిడి చేశారని గతంలో చేసిన ఆరోపణలను ఆమె పునరుద్ధాటించారు. ‘‘విచారణ సందర్భంగా కొంత మంది పేర్లను చెప్పమని నన్ను హింసించారు. నేను ఎవరి పేర్లను చెప్పకపోవడంతో నన్ను మరింత తీవ్రంగా హింసించారు”అని వెల్లడించారు.