రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి మల్లిఖార్జున ఖర్గే రాజీనామా

రాజ్యసభ ప్రతిపక్షనేత పదవికి మల్లిఖార్జున ఖర్గే రాజీనామా

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే... రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేశారు. పార్టీ చీఫ్ సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మల్లికార్జున ఖర్గే పోటీ చేస్తున్నారు. తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ , జార్ఖండ్ కాంగ్రెస్ లీడర్ KN త్రిపాఠి కూడా అధ్యక్ష బరిలో ఉన్నారు. గాంధీ ఫ్యామిలీతో పాటు పార్టీలో చాలా మంది ఖర్గేకు మద్దతుగా ఉన్నట్లు సమాచారం. అధ్యక్ష పదవికి మూడు నామినేషన్లు వచ్చాయి.  ఈనెల 4 వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 



మరోవైపు  మల్లిఖార్జున ఖర్గేను ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. తాను ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తానని ఖర్గే ధీమాగా చెబుతున్నారు. ఉదయ్ పూర్ లో జరిగిన సమావేశంలో AICC. ఒక నాయకుడు... ఒక పదవి అనే తీర్మానం చేసింది  అధ్యక్షుడి పదవికి పోటీలో ఉన్న  ఖర్గే.... ఉదయ్ పూర్ తీర్మానం ప్రకారం రాజ్యసభలో ప్రతిపక్షనేత పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.