కరోనా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలివ్వాలి

V6 Velugu Posted on Nov 28, 2021

కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశామన్నారు రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే. అలాగే.. వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశామన్నారు. రైతు చట్టాల విషయంలో ప్రధాని చేసిన కామెంట్స్ ఆందోళనకరంగా ఉన్నాయన్నారు ఖర్గే. మోడీ మాట తీరు చూస్తే.. చట్టాలను మళ్లీ  కొద్ది రోజుల తర్వాత తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. అలాగే.. ద్రవ్యోల్బణం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కరోనా పరిస్థితిపై ఆల్ పార్టీ మీటింగ్ లో చర్చించినట్టు అపోజిషన్ నేతలు చెప్పారు. 

 

Tagged Mallikarjuna kharghe demandeCOVID19 victim, compensation of Rs 4 lakhs each

Latest Videos

Subscribe Now

More News