PUBG కోసం కడుపుతో ఉన్న భార్యను వదిలేశాడు

PUBG కోసం కడుపుతో ఉన్న భార్యను వదిలేశాడు

Man chooses PUBG over pregnant wife, leaves family because of his PUBG addictionఆన్ లైన్ మొబైల్ గేమ్ PUBG పిల్లల చదువులనే కాదు.. వివాహ జీవితాన్నీ కూడా వదలడం లేదు. ఈ గేమ్ అడిక్షన్ అనేది మనుషుల జీవితాలతో ఆడుకుంటోంది. PUBG ఆడుకునేటప్పుడు డిస్ట్రబెన్స్ ఉండొద్దని ఎంతకైనా తెగిస్తున్నారు దానికి అడిక్ట్ అయిన వాళ్లు. కుటుంబం, బాధ్యతలు అని చెబుతూ ఆడుకోనీయకుండా చేస్తున్నారని ఓ మలేషియన్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. 4 నెలల కడుపుతో ఉన్న భార్య కూడా PUBG ముందు అతడికి కనిపించలేదు. మొబైల్ లో గేమ్ ఆడుకోవడానికి మించి మరో ఆనందం లేదనుకుని వెళ్లిన అతడు నెల రోజులుగా ఇంటికి తిరిగి రాలేదు. మలేషియాకు చెందిన ఓ మహిళ తన ఆవేదనను ఫేస్ బుక్ పోస్టులో తెలిపింది.

కొన్నాళ్ల క్రితం ఆ యువకుడికి తన తమ్ముడు PUBG గేమ్ ను అలవాటు చేశారు. ఆ వార్ సీన్లు, గన్ ఫైట్లకు అలవాటు పడిన అతడు ఉద్యోగం, కుటుంబ బాధ్యతలను కూడా మరచిపోయాడు. రాత్రంతా PUBG ఫ్రెండ్స్ తో గేమ్ ఆడుకుంటూ నిద్ర మానేశాడు. పగలు ఉద్యోగం వదిలి పడుకుని ఉండిపోతున్నాడు. దీంతో ఇంట్లో ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. అయినా అతడికి ఏమీ పట్టలేదు. ఈ పరిస్థితి చూసి PUBGని వదిలేయాలని భార్య చెప్పడంతో అతడికి కోపం వచ్చింది. పదే పదే కుటుంబ బాధ్యతలు చూసుకోవాలని చెబుతుండడంతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, తన భర్త తిరిగి ఇంటికి రావాలని అందరూ ప్రార్థించాలని ఆ అభాగ్యురాలు ఫేస్ బుక్ పోస్టులో కోరింది.

ఇండియాలోనూ..

మన దేశంలోనూ PUBG అడిక్షన్ తక్కువేం లేదు. గేమ్ కు బానిసైపోయి జమ్ములో ఓ ఫిట్ నెస్ ట్రైనర్ తనను తానే కొట్టుకుని ఆసుపత్రిలో చేరాడు.

ముంబైలో ఇటీవలే ఓ 18 ఏళ్ల కుర్రాడు తనకు పేరెంట్స్ PUBG సపోర్ట్ చేసే ఫోన్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.

అలాగే గేమ్ పై గుజరాత్ స్కూల్స్ లో బ్యాన్ విధిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

తమిళనాడులోని విట్ సంస్థ కూడా PUBG పై నిషేధం విధించింది.