
ఈత కొడుతున్నప్పడు నీటిలో చిన్న పాము కనిపిస్తేనే.. మళ్లీ నీళ్లలోకి దిగం. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం ఏకంగా తిమింగలం మీదికే దూకేశాడు. అంతేనా దాని రెక్కను పట్టుకొని సముద్రంలో ఈదాడు. ఈ విచిత్ర ఘటన సౌదీ అరేబియాలో జరిగింది. జాకీ అల్-సబాహి అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి బోట్ లో యాన్బు తీరంలో ఎర్ర సముద్రం పర్యటనకు వెళ్లాడు. అలా వెళ్తున్న వారికి ఒక తిమింగలం కనిపించింది. వెంటనే సబాహి దాని మీద దూకాడు. దాని రెక్క పట్టుకొని.. తిమింగలంతో పాటు సముద్రంలో ఈదాడు.
ఆ సంఘటనను మొత్తం అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోలో సబాహి స్నేహితుడు.. ‘జాగ్రత్త.. అది నిన్ను మింగగలదు’ అని అరవడం కూడా వినవచ్చు. అంతేకాకుండా మరో స్నేహితుడు సబాహిని ఎంకరేజ్ చేయడం కూడా వినోచ్చు. ఈ వీడియోను ఆ గ్రూప్ లోని అలాల్వానీ అబ్దుల్లా అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే 14 వేల వ్యూస్ వచ్చాయి.
أحد رجال البحر في ينبع يسبح مع أسماك البهلوان pic.twitter.com/QnvX9r2KE2
— عبدالله العلوني (@alalwaniabdulla) August 16, 2020
— عبدالله العلوني (@alalwaniabdulla) August 16, 2020
అయితే సబాహి చేసిన పనిని కొంతమంది నెటిజన్లు మెచ్చుకోగా.. మరికొంత మంది మాత్రం అలా చేసి ఉండకూడదని విమర్శిస్తున్నారు.
For More News..