కోల్‌బెల్ట్, వెలుగు : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ ఓపెన్‌కాస్ట్ సెకండ్ ఫేజ్ మైన్ విస్తరణకు లైన్ క్లియర్ అయింది. గని కోసం సేకరించాల్సిన అటవీ భూమికి బదులుగా 395 ఎకరాల అటవీయేతర భూమిని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. దీంతో సింగపూర్ గ్రామంలోని స్థలాన్ని గురువారం రాష్ట్ర అటవీ, సింగరేణి సంస్థ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ స్థలంలో అటవీ పెంపకం కోసం భూమి భౌగోళిక స్థితి, విస్తీర్ణం, మట్టిగుణాలు, నీటి లభ్యత, భవిష్యత్ అటవీ అభివృద్ధి అవకాశాలు వంటి అంశాలను ఆఫీసర్లు పరిశీలించారు. అవసరమైన ప్రమాణాలు, ప్రభుత్వ మార్గదర్శకాలు, పర్యావరణ నిబంధనలను పాటిస్తూ తర్వాతి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అడిషనల్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ పారెస్ట్ సి.శరవణన్, డిప్యూటీ కన్జర్వేటర్ సంహిత, కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎస్.శాంతారాం, మంచిర్యాల జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, సింగరేణి శ్రీరాంపూర్, మందమర్రి ఏరియాల జీఎంలు మునిగంటి శ్రీనివాస్, ఎన్.రాధాకృష్ణ, ఆఫీసర్లు లక్ష్మీపతి గౌడ్, మోహన్ చంద్ర పర్గైన్, చిప్ప వెంకటేశ్వర్లు, సర్వేశ్వర్రావు, రత్నాకర్, అబ్దుల్ అజార్
పాల్గొన్నారు.
