ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం సాధించిన మనిక బాత్రా

 ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం సాధించిన మనిక బాత్రా

భారత టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనిక బాత్రా చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో కాంస్య పతకం సాధించింది.  ప్రపంచ ఆరో ర్యాంక‌ర్‌.. మూడు సార్లు ఆసియా క‌ప్ ఛాంపియ‌న్ అయిన జ‌పాన్ ప్లేయర్ హినా హ‌య‌త్‌పై 4-2 ( 11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2) పాయింట్లతో ఓడించి బ్రౌంజ్ను దక్కించుకుంది. దీంతో ఆసియా కప్ టేబుల్ టెన్నిస్లో కాంస్యం సాధించిన మొద‌టి మ‌హిళా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా మ‌నికా రికార్డు నెలకొల్పింది. 

https://twitter.com/the_bridge_in/status/1593900038312562688

ఆసియాకప్ టోర్నీ ఫస్ట్ రౌండ్లో  మనికా చైనాకు చెందిన జింగ్ టాంగ్పై విజయంసాధించి..రెండో రౌండ్కు చేరుకుంది. ఆ తర్వాత నాల్గో సీడ్ ప్లేయర్ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో  ఆమె 4-3 (6-11,11-6,11-5,11-7,8-11,9-11,11-9)స్కోరు తేడాతో విజయం సాధించి సెమీస్కు చేరింది. ఇక సెమీస్లో మిమా ఇటో చేతిలో 2-4(8-11,11-7,7-11,6-11,11-8,7-11)తో ఓడిపోయింది. అయినా కాంస్య పతక పోరులో హనా హయతపై అద్భుత  ఆటతీరుతో గెలిచి చరిత్ర సృష్టించింది.