మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ : లిక్కర్‌ స్కాంలో అరెస్టయిన (సీబీఐ, ఈడీ ద్వారా) ఆప్‌ కీలక నేత మనీష్‌ సిసోడియా కస్టడీని ఢిల్లీ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈ కేసులో కస్టోడియల్‌ ఇంటరాగేషన్‌ ముగియడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు సిసోడియాను మార్చి 22న రౌస్‌ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. స్పెషల్‌ జడ్జి ఎంకే నాగ్‌పాల్‌, సిసోడియా జ్యుడీషియల్‌ కస్టడీని ఏప్రిల్‌ 5వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ ఆదేశించారు. 

మరోవైపు.. సీబీఐ విచారిస్తున్న లిక్కర్‌ పాలసీ కేసులో బెయిల్ కోసం సిసోడియా  చేసిన అభ్యర్థనపై విచారణను మంగళవారం ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. బెయిల్ అభ్యర్థనపై శనివారం విచారణ జరగనుంది.

ఫిబ్రవరి 26వ తేదీన విచారణ కోసం పిలిపించుకున్న సీబీఐ.. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలోనే ఆయన్ని అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక.. మనీలాండరింగ్‌ అభియోగాలకుగానూ ఈడీ సిసోడియాను మార్చి 9వ తేదీన తీహార్‌ జైల్లో అరెస్ట్‌ చేశారు.