కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు :  మహబూబ్ నగర్ లోక ల్ బాడీ బై పోల్ ఎన్నికకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన్నె జీవన్ రెడ్డి పేరు ఖరారైంది. ఈ మేరకు శుక్రవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ గా ఉన్న నారాయణ రెడ్డి  కల్వకుర్తి నుంచి  ఎ మ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నెల 4న నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతాయి. ఈ నెల 28న పోలింగ్ జరగనుండగా.. వచ్చే నెల 2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.