Samsung S23: ఇండియాలోనే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్ల తయారీ

Samsung S23: ఇండియాలోనే శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 ఫోన్ల తయారీ

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ సంస్థ శామ్ సంగ్ ఇండియా మార్కెట్ అవసరాలను తీర్చడానికి తమ ప్రీమియం గెలాక్సీ ఎస్ 23 స్మార్ట్ ఫోన్లను ఇక్కడే తయారు చేయనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను శామ్ సంగ్ వియత్నాం ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. కంపెనీ వాటిని భారతదేశంలో అమ్మడానికి దిగుమతి చేసుకుంటున్నది. ఇక నుంచి భారతదేశంలో అమ్మే అన్ని గెలాక్సీ ఎస్ 23 స్మార్ట్ ఫోన్లన్నీ నోయిడా ఫ్యాక్టరీలో తయారవుతాయి. కంపెనీ ఇప్పటికే నోయిడా ఫ్యాక్టరీలో కొన్ని ఫోన్లను తయారుచేస్తోంది. 

కెమెరా లెన్స్ దిగుమతిపై టాక్స్ ని తొలగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన మరునాడే శామ్ సంగ్ ఈ ప్రకటన చేసింది. హైఎండ్ కెమెరా సెన్సార్లతో కూడిన గెలాక్సీ ఎస్ 23 సిరీస్ స్మార్ట్ ఫోన్ల మూడు మోడల్స్ ను కంపెనీ బుధవారం లాంచ్ చేసింది. 12-200 మెగాపిక్సెల్స్ కెమెరా సెన్సార్లతో కూడిన ఐదు సెట్ల కెమెరాలతో ఈ ఫోన్ రానుంది. గెలాక్సీ ఎస్2 3 సిరీస్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. పోయిన ఏడాది లాంచ్ అయిన గెలాక్సీ ఎస్ 22 స్మార్ట్ఫోన్ల ధరలు రూ.72.999- రూ. 1.18,999 మధ్య ఉన్నాయి.