ఢిల్లీ జేఎన్యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

ఢిల్లీ జేఎన్యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు

ఢిల్లీలోని జేఎన్యూ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కన్పించడం కలకలం రేపింది. క్యాంపస్లోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గోడలపై దుండగులు అభ్యంతరకరమైన రాతలు రాశారు. ‘బ్రహ్మణలు క్యాంపస్ను విడిచి వెళ్లాలి’. ‘బ్రాహ్మణ్ బనియాలు మీ కోసం వస్తున్నాం.. ప్రతీకారం తీర్చుకుంటాం’. ‘బ్రాహ్మణ్ భారత్ చోడో’ వంటి నినాదాలను రాశారు. వీటిని వీసీ శాంతిశ్రీ డీ పండిట్ ఖండిస్తూ..ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. 

ఈ రాతలను కమ్యూనిస్టులే రాశారని ఏబీవీపీ ఆరోపించింది. సమాజాన్ని విషపూరితం చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఏబీవీపీ జేఎన్యూ అధ్యక్షుడు రోహిత్ కుమార్ అన్నారు. స్వేచ్ఛగా ఆలోచించే ప్రొఫెసర్లను భయపెట్టేందుకు వారి ఛాంబర్లను సైతం పాడుచేశారని మండిపడ్డారు. జేఎన్యూ ఉపాధ్యాయుల సంఘం కూడా ఈ చర్యను ఖండించింది. ఇది లెఫ్ట్ లిబరల్ గ్యాంగ్ పని అని ఆరోపిస్తూ ట్వీట్ చేసింది.