పావు ఎకరంలో ఎన్నో రకాల పంటలు

పావు ఎకరంలో ఎన్నో రకాల పంటలు

కేరళలోని కక్కాడావ్‌ అనే ఊళ్లో, రోడ్‌ పక్కన ఉంటుంది జోషి మాథ్యూ ఇల్లు. ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, రకరకాల పూలు, పండ్ల మొక్కలు కనువిందు చేస్తాయి. ఇంటి చుట్టూ ఉన్నది పావు ఎకరం స్థలమే అయినా, అక్కడికి వెళ్తే అడవి మధ్యలో ఉన్న ఫీలింగ్‌ కలుగుతుంది ఎవరికైనా. ఇదంతా మాథ్యూ, ఆయన భార్య జూలీల కృషి ఫలితమే. ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయినా ప్రొఫెషనల్‌‌‌‌‌‌‌‌గా ఫొటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన మాథ్యూకు ప్రకృతి అంటే చాలా ఇష్టం.నగర జీవితంకన్నా, పచ్చని చెట్ల మధ్య, పల్లెటూళ్లో గడపడమే ఆయనకిష్టం. సిటీలో పనిచేస్తే ఎక్కువ ఆదాయం వచ్చే అవకాశం ఉన్నా, సొంతూళ్లోనే ఉంటూ పనిచేసుకుంటున్నాడు. పెళ్లిళ్లు, ఫంక్షన్స్‌‌‌‌‌‌‌‌లో ఫొటోలు తీస్తూనే, తనకిష్టమైన ఆర్గానిక్‌ ఫార్మింగ్‌ పై దృష్టిపెట్టాడు.

స్నేహితుడి సలహాతో…

మాథ్యూది ఒకప్పుడు వ్యవసాయ కుటుంబమే అయినా ఉన్నది పావు ఎకరం భూమి మాత్రమే. ఇంత తక్కువ భూమిలో ఎలా సాగు చేయొచ్చో మాథ్యూకు జోయ్‌ చాన్‌‌‌‌‌‌‌‌ అనే ఫ్రెండ్‌ చెప్పాడు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో ఉన్న అలాంటి పద్ధతుల గురించి వివరించాడు. దీంతో వాటిని ఫాలో అయ్యి మొదట్లో కొన్ని మొక్కలు నాటాడు. వాటి నుంచి వచ్చిన పండ్లు, కూరగాయలు మాథ్యూకు మంచి ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాయి. నేచురల్‌‌‌‌‌‌‌‌గా, సొంతంగా పండించుకున్న వాటిని తింటే ఉండే కిక్‌ మాథ్యూకు తెలిసింది. అంతే అప్పటినుంచి సొంతంగా పండించుకోవడంపై దృష్టిపెట్టాడు. అలా ఐదేళ్ల క్రితం తన పావు ఎకరం స్థలంలో సాగు చేయడం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

భార్య సహకారంతో…

ఇంటికి కావాల్సిన కూరగాయలు, పండ్లు వంటివన్నీ ఇంటిదగ్గరే పండించుకోవాలి అనుకున్నారు మాథ్యూ, అతడి భార్య జూలీ. పాల కోసం ఒక ఆవును కొనుక్కున్నారు. పాలతో డైరీ ప్రొడక్ట్స్‌ చేసుకుని, ఆవుపేడను ఎరువుగా వాడుతున్నా రు. స్థానిక రైతుల్ని కలిసి విత్తనాలు సేకరించారు. వీటితో సాగు చేసేందుకు కష్టమైన పద్ధతుల్ని పాటించకుండా, కొన్ని సింపుల్‌‌‌‌‌‌‌‌ అండ్‌ బెస్ట్‌‌‌‌‌‌‌‌ మెథడ్స్‌‌‌‌‌‌‌‌ను ఫాలో అయ్యారు. నీటి పారుదల కోసం కేరళలో ‘తిరి నాన’గా పిలిచే‘విక్‌ ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌’ను ఫాలో అయ్యారు. పంట మొక్కలకు ఎరువుగా, పెస్టిసైడ్స్‌‌‌‌‌‌‌‌గా కిచెన్‌‌‌‌‌‌‌‌ వేస్ట్‌‌‌‌‌‌‌‌, ఆవుపేడ, గోమూత్రం, మొక్కల వ్యర్థాల వంటివి ఉపయోగించారు.

తేనె ఉత్పత్తి

ఈ పావు ఎకరంలోనే తేనెటీగల పెంపకం స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. హానికరంకాని తేనెటీగల్ని పెంచుతున్నారు. ఇవి కుట్టి నా ఏం కాదు. ఈ తేనెటీగల ద్వారా సంవత్సరానికి దాదాపు 20 కిలోల తేనె సేకరిస్తున్నా రు. వీటితోపాటు ఈ స్థలంలోనే రెండు చిన్న కొలనులు ఏర్పాటు చేశారు. ఈ రెండింట్లో రకరకాల చేపలు, రొయ్యల్ని పెంచుతున్నా రు. ఇక్కడే కొన్ని కోళ్లను కూడా పెంచుతున్నారు. దీంతో మాంసం కోసం బయట చేపలు, చికెన్‌‌‌‌‌‌‌‌ కొనాల్సిన అవసరం కూడా లేదు. రైస్‌‌‌‌‌‌‌‌, గోధుమలు తప్ప దాదాపు అన్నీ ఇంటి పక్కన పెరట్లో, సేం ద్రియ పద్ధతిలో పండినవే తింటున్నారు.

ఆదాయం కూడా

మొదట్లో ఇంటి అవసరాల కోసమే సాగు చేసినా, దీన్నుంచి కొంత ఆదాయం కూడా వస్తోంది మాథ్యూకు . ఊళ్లో స్నేహితులు, తెలిసిన వాళ్లకు పండ్లు, కూరగాయల్ని, డైరీ ప్రొడక్స్‌ట్ , చేపల వంటివి అమ్ముతున్నాడు. ముఖ్యం గా లాక్‌‌‌‌‌‌‌‌డౌన్‌‌‌‌‌‌‌‌ టైమ్‌ లో బయట వీటి అమ్మకాలు తగ్గిపోవడంతో, మాథ్యూ తను సాగు చేసిన వాటిని అమ్మి మంచి లాభాలు సాధించాడు.