జూన్​ క్వార్టర్లో మారుతి లాభం రూ. 1,036 కోట్లు

జూన్​ క్వార్టర్లో మారుతి లాభం రూ. 1,036 కోట్లు

న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా లాభం జూన్​ 2022 క్వార్టర్లో రెట్టింపయింది. అంతకు ముందు ఏడాది మొదటి క్వార్టర్లో కంపెనీకి రూ. 475 కోట్ల లాభం రాగా, ఈ ఏడాది మొదటి క్వార్టర్లో అది  రూ. 1,036 కోట్లకు పెరిగింది. జూన్​ 2022 క్వార్టర్లో అమ్మకాలు రూ. 26,512 కోట్లకు చేరినట్లు మారుతి సుజుకి వెల్లడించింది. కిందటి ఏడాది జూన్​ త్రైమాసికంలో ఈ సేల్స్​ రూ. 17,776 కోట్లే. కొవిడ్​ లాక్​డౌన్లు, షట్​డౌన్ల వల్ల అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లో పెర్​ఫార్మెన్స్​ ఎఫెక్టయిందని మారుతి సుజుకి తెలిపింది. ఈ ఏడాది జూన్​ క్వార్టర్లో మొత్తం 4,67,931 వెహికల్స్​ అమ్మినట్లు పేర్కొంది. అంతకు ముందు ఏడాది జూన్​ క్వార్టర్లో ఈ అమ్మకాలు 3,53,614 యూనిట్లు మాత్రమే. దేశీయ మార్కెట్లో సేల్స్​ 3,98,494 యూనిట్లని, 69,437 వెహికల్స్​ను ఎగుమతి చేశామని వివరించింది.

జూన్​ 2021 క్వార్టర్లో దేశీయ అమ్మకాలు 3,08,095 యూనిట్లు. స్టాండ్​ ఎలోన్​ ప్రాతిపదికన జూన్​ 2022 త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,013 కోట్లు. ఎలక్ట్రానిక్​ చిప్స్​ కొరత ఇంకా వెంటాడుతోందని, దీంతో ఈ ఏడాది మొదటి క్వార్టర్లో 51 వేల వెహికల్స్​ ప్రొడక్షన్​ చేయలేకపోయామని మారుతి సుజుకి ఇండియా వెల్లడించింది. జూన్​ 2022 చివరి నాటికి కస్టమర్ల నుంచి వచ్చిన 2.8 లక్షల ఆర్డర్లు పెండింగ్​లో ఉన్నాయని, వీలైనంత త్వరగా ఆ వెహికల్స్​ను అందించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని పేర్కొంది. కమోడిటీస్ రేట్లు పెరిగిన ఎఫెక్ట్​ ఆపరేటింగ్​ ప్రాఫిట్​పై పడినట్లు కూడా మారుతి సుజుకి ఇండియా వివరించింది. వెహికల్స్​ రేట్లను పెంచడం కొంత మేరకే సాధ్యమైందని పేర్కొంది.