ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌తో ఆపేస్తా: మేరీ కోమ్‌‌‌‌

ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌తో ఆపేస్తా: మేరీ కోమ్‌‌‌‌

న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌, ఇండియా లెజెండరీ బాక్సర్‌‌‌‌ మేరీ కోమ్‌‌‌‌ ఈ ఏడాది జరిగే ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌తో తన చివరి పంచ్‌‌‌‌ ఇవ్వాలని చూస్తోంది. ఈ మెగా టోర్నీతో కెరీర్‌‌‌‌కు వీడ్కోలు పలకాలని ఆశిస్తున్నట్టు  40 ఏండ్ల మేరీ తెలిపింది. బాక్సింగ్‌‌‌‌లో ఏ టోర్నీలో ఆడాలన్నా 40 ఏండ్లు దాటకూడదు. గతేడాది కామన్వెల్త్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌లో అయిన గాయం నుంచి కోలుకుంటున్న  మేరీ ఈ నవంబర్‌‌‌‌లో  41వ పడిలోకి అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో చైనాలోని హంగ్జౌలో  సెప్టెంబర్‌‌‌‌ 23 నుంచి అక్టోబర్‌‌‌‌ 8వ వరకు జరిగే ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ ఆమెకు చివరి టోర్నీ కానుంది. ‘నాకైతే అస్సలు రిటైర్ అవ్వాలని లేదు. ఇంకో ఐదేండ్లు ఆడాలని ఉంది. కానీ, 40 ఏండ్లు దాటితే మేం పోటీ పడలేం. కాబట్టి ఇప్పుడు నా మెయిన్‌‌‌‌ టార్గెట్‌‌‌‌ ఏషియన్‌‌‌‌ గేమ్స్‌‌‌‌ మాత్రమే. తొందర్లోనే కోలుకొని, ట్రెయినింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేస్తా.  ఈ ఏడాది రిటైర్ అయ్యేలోపు ఓసారి బరిలోకి దిగాలన్నది నా డ్రీమ్‌‌‌‌’ అని మేరీ చెప్పుకొచ్చింది.