సిక్కుతో పెట్టుకున్నాడు.. దోపిడీ సితార్ అయ్యింది.. ఏ దేశంలో అయినా ఇంతే..

సిక్కుతో పెట్టుకున్నాడు.. దోపిడీ సితార్ అయ్యింది.. ఏ దేశంలో అయినా ఇంతే..

దొంగతనానికి వచ్చి ఇరుక్కుపోయిన ఉదంతాలు  ఎన్నో చూస్తుంటాం. వారిలో కొందరు దొరికి చావు దెబ్బలు తింటుంటారు. అలాంటి ఘటనే తాజాగా అమెరికాలోని ఓ కిరాణ దుకాణంలో జరిగింది. 

సంబంధిత వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో కనిపిస్తున్న విజువల్స్ ప్రకారం.. ముసుగుతో ఉన్న ఓ దొంగ అమెరికాలోని  సిక్కు యజమాని నడుపుతున్న కిరాణ దుకాణంలో దొంగతనానికి వచ్చాడు. 

కస్టమర్లు, యజమానిని తన వెంట తెచ్చుకున్న మారణాయుధాలతో బెదిరిస్తూ ఓ పెద్ద బుట్టలో సామగ్రి మొత్తం వేసుకోసాగాడు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన యజమాని మెల్లిగా అక్కడి నుంచి దొంగ కంట కనబడకుండా జారుకున్నాడు. 

బయటే ఉన్న పెద్ద కర్రను వెంట తీసుకొచ్చాడు. అప్పటికే దొంగ వస్తువులతో పారిపోతుండటాన్ని ఆపిన మరో వ్యక్తి అతని కాళ్లు చేతులు పట్టుకున్నాడు. అనంతరం యజమాని కర్రతో అతన్ని చావ బాదాడు. ఇంకేముంది ఓళ్లు హూనం అయింది. 

నెటిజన్ల స్పందన..

ఈ వీడియోను ట్విటర్ లో షేర్ చేయగా.. గంటల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. అయితే ఈ ఘటనపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు జస్టిస్ మోడ్ అని కామెంట్ చేయగా.. మరి కొందరు తాము హింసకు మద్దుతు తెలపం.. కానీ ఇది ది బెస్ట్ వీడియో అంటూ కామెంట్ చేశారు.