
పెద్దపల్లి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు ఒక్కరోజు ముందు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ఆశించి భంగపడ్డ జడ్పీటీసీ గంట రాములు, సీనియర్ లీడర్సి.సత్యనారాయణ రెడ్డి, వేముల రాంమూర్తితో పాటు పలువురు మాజీ సర్పంచులు, యువజన నాయకులు బుధవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. రెండు రోజుల్లో భవిష్యత్కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. బుధవారం వారు మాట్లాడుతూ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీని జేబు సంస్థగా మార్చుకున్నాడన్నారు. పెద్దపల్లిలో విజయరమణారావు ఒంటెద్దు పోకడ ప్రదర్శిస్తున్నారని, పార్టీలో పాత క్యాడర్ లేకుండా చేస్తున్నారన్నారు. టికెట్ఆశించిన వారితో హైకమాండ్ మాట్లాడకపోవడం శోచనీయమని, పార్టీలో బీసీలకు ప్రాధాన్యత లేదన్నారు. బానిసల్లాగా కొనసాగలేకనే రాజీనామాలు చేస్తున్నామన్నారు.